English   

పాయల్ కి కరోనా...క్లారిటీ ఇచ్చేసింది !

payal
2020-05-03 11:04:13

కరోనా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించింది కేంద్రం. మే 17 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. రెడ్ జోన్లను మినహాయించి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పరిమిత సంఖ్యలో సడలింపులు ఇచ్చింది. అత్యవసర సర్వీసులు మినహా మిగతా అన్నింటిపై నిషేధం కొనసాగుతుంది..గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు కూడా అనుమతిచ్చింది. ఆ విషయం పక్కన పెడితే ఈ కరోనా విషయంలో ఎప్పటిలానే ఫేక్ న్యూస్స్ ఎక్కువగా మొదలయింది. ఈ పరిస్థితుల్లో ఎవ్వరికయినా చిన్న జ్వరం వచ్చినా అది కరోనానే అనే అపోహ పెరిగిపోయింది. అయితే జ్వరం వస్తే చాలు ఆ వ్యక్తికి కరోనా సోకిందని పుకార్లు రేగడం మొదలయింది. ఇక సెలబ్రిటీల పరిస్థితి అయితే మరీ దారుణం.

చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కరోనా అనే రూమర్లు పుడుతున్నాయి. తాజాగా నటి పాయల్ ఘోష్ విషయంలోనూ అదే జరిగింది. ఈ మధ్యన ఆమె అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లడంతో ఆమెకు కరోనా సోకిందనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఇలాంటి వార్తలపై స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది ఆమె.  ''నాకు తొలుత తలనొప్పి, ఆపై జ్వరం రావడంతో నా బంధుమిత్రులు ఆందోళనకు గురయ్యారు. నాకు కరోనా సోకిందేమో అని భయపడ్డారు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోగా అది కరోనా కాదని మలేరియా ఫీవర్ అని తేలింది. ప్రస్తుతం మలేరియా నుంచి కోలుకుంటున్నా'' అని చెబుతూ తనకు కరోనా అని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టింది పాయల్ ఘోష్. చాలా బాలీవుడ్ సినిమాలలో మెరుస్తున్న ఈమె, టాలీవుడ్‌లో ప్రయాణం, ఊసరవెల్లి సినిమాల్లో నటించింది.

More Related Stories