English   

బాల‌య్య‌తో శ్రీ‌కాంత్ శ‌త్రుత్వం.. నువ్వా నేనా..?

nbk
2020-05-04 07:27:21

ఒక్కో హీరో విల‌న్ గా మారిపోతున్నాడు. సీనియ‌ర్ హీరోల‌కు ఇప్పుడు విల‌న్లుగా గిరాకీ పెరిగిపోతుంది. నిన్న‌టిత‌రంలో దుమ్ము దులిపేసిన హీరోలంతా ఇప్పుడు ప్ర‌తినాయ‌కులుగా ర‌చ్చ చేస్తున్నారు. వ‌య‌సైపోయిన హీరోలు పాలిటిక్స్ లోకి రావ‌డం ఎంత కామ‌నో.. మార్కెట్ త‌గ్గిపోయిన హీరోలు విల‌న్లుగా మార‌డం కూడా అంతే కామ‌న్. తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా కాలం నుంచి జ‌రుగుతున్న తీరు ఇదే. సుమన్, జ‌గ‌ప‌తిబాబు, అర్జున్ ఇలా ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన స్టార్స్ అంతా ఇప్పుడు విల‌న్ వేషాలు వేసుకుంటున్నారు. హీరోలుగా కంటే ఇప్పుడు విల‌న్లుగానే వీళ్ల‌కు సూప‌ర్ క్రేజ్ ఉంది. ఇప్పుడు శ్రీ‌కాంత్ కూడా ఈ దారిలోకి వ‌చ్చేసాడు. ఈయ‌న ఇప్ప‌టికే నాగ‌ చైత‌న్య హీరోగా కృష్ణ మ‌రిముత్తు అనే కొత్త ద‌ర్శ‌కుడు తెరకెక్కించిన యుద్ధం శరణం సినిమాలో విల‌న్ గా నటించాడు.

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో శ్రీకాంత్ విలనిజం వేస్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాలోనూ శ్రీ‌కాంత్ నే విల‌న్ గా తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. తర్వాత బ్రేక్స్ లేకుండా పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు. ఈ చిత్రం కోసమే లుక్ కూడా మార్చేస్తున్నాడు శ్రీకాంత్. కచ్చితంగా బోయపాటి సినిమా తర్వాత శ్రీకాంత్ కెరీర్ గ్రాఫ్ మారిపోతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు కూడా. లెజెండ్ తర్వాత జగపతిబాబు.. సరైనోడు తర్వాత ఆది తెలుగులో రప్ఫాడించారు. ఇప్పుడు శ్రీకాంత్ కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు ఫ్యాన్స్. మరి బాలయ్యతో శ్రీకాంత్ శతృత్వం ఎలా ఉంటుందో చూడాలిక.

More Related Stories