చిరంజీవి డాన్స్ వీడియో అదిరింది.. నాటి హీరోయిన్లతో..

వరల్డ్ డాన్స్ డే సందర్భంగా తన స్టెప్పులతో ఉన్న ఓ డాన్సింగ్ వీడియోను ఇస్తానని చిరంజీవి అభిమానులకు ప్రామిస్ చేసాడు. అయితే అది సినిమా వీడియో అయ్యుంటుందని అంతా అనుకున్నారు. కానీ అది రియల్ డాన్స్ అని ఇప్పుడు తెలిసింది. నిజానికి ఎప్రిల్ 29నే విడుదలకు ప్లాన్ చేసినా ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి బాలీవుడ్ లెజెండ్స్ చనిపోవడంతో మూడు రోజుల తర్వాత ఈ వీడియోను ట్వీట్ చేసాడు చిరంజీవి. ఇందులో మెగాస్టార్ నాటి హీరోయిన్లతో స్టెప్పులేసాడు. ఇదంతా రీ యూనియన్ పార్టీలో జరిగింది. 80ల్లో ఉన్న స్టార్స్ అంతా ఏటేటా కలుసుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్లో కూడా ఇలాంటి పార్టీ జరిగింది. అయితే ఈ సారి చిరంజీవి ఇంట్లోనే ఈ పార్టీ జరిగింది. దానికి చాలా మంది ప్రముఖులు వచ్చారు.
Fun is meeting friends. Fun is a little dance.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 3, 2020
As promised, here is the throwback dance video #80sClub #10thReunion @hasinimani @khushsundar @JSKapoor1234 @ActressRadha @realradikaa#LissyPriyadarshan pic.twitter.com/c4fiHnDMRh
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే కొత్త ఇంట్లోకి వెళ్లాడు. అక్కడే ఈ పార్టీ జరిగింది. 9 ఏళ్లుగా రకరకాల చోట్ల ఈ మీటింగ్ జరుగుతూ వస్తుంది. గతేడాది చిరంజీవి హోస్ట్ చేసాడు. పదో వార్షికోత్సవ దినోత్సవం కావడంతో పార్టీ గ్రాండ్ గా చేసాడు మెగాస్టార్. తన సైరా సినిమా విజయోత్సవాన్ని కూడా 80ల్లోని తారలతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వహించారు. ఈ రీయూనియన్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తారలు వచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా మలయాళం.. కన్నడం నుంచి మొత్తం 40 మంది తారలు ఈ వేడుకకు హాజరయ్యారు. గత తొమ్మిదేళ్లుగా ఈ వేడుకలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఇక ఈ పార్టీలో చేసిన డాన్స్ ఇప్పుడు బయటికి వచ్చింది. చిరంజీవి ఈ వీడియోను విడుదల చేసాడు. అందులో సుహాసిని, రాధతో పాటు మరికొందరు నాటి హీరోయిన్లతో కలిసి ఫుల్లుగా స్టెప్పులు ఇరగదీసాడు చిరంజీవి. ఆ వీడియో వైరల్ అవుతుందిప్పుడు.