English   

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా.. రాజమౌళి రామాయణం

Rajamouli
2020-05-04 09:19:22

రామాయణ్.. ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో ఇది ఒక సువర్ణాధ్యాయం. 1980ల్లో ఈ సీరియల్ గురించి తెలియని వాళ్లంటూ ఉండరు. 90ల్లో కూడా దీని గురించి చర్చలు జరిగాయి. దూరదర్శన్‌ లో వచ్చిన ఈ సీరియల్ ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన ఈ సీరియల్ అప్పట్లో అంటే 1987  జనవరి 25 నుంచి  1988   జులై 31 మధ్యలో 78 ఎపిసోడ్స్‌గా రామాయణ్ ప్రసారమైంది. అప్పట్లో ఇది చాలా ప్రాచూర్యం పొందింది. అలాంటి అద్భుతమైన సీరియల్‌ను మళ్లీ 33 ఏళ్ళ తర్వాత లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు పున:ప్రసారం చేసింది దూరదర్శన్. ముందు 21 రోజులు మాత్రమే టెలికాస్ట్ చేయాలి అనుకున్నా కూడా రామాయణ్ సీరియల్ కు అనూహ్యమైన స్పందన వస్తుండటంతో ఇప్పుడు మొత్తం 78 ఎపిసోడ్స్ ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది దూరదర్శన్. ఇప్పటికే దాదాపు 50 రోజుల ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. 

ఎప్రిల్ 16న ఏకంగా 7.7 కోట్ల మంది రామాయణ్ చూసారని డిడి ఇండియా ట్వీట్ చేసింది. ఇవి చూసి అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ప్రముఖ హాలీవుడ్ షోలైన ది బిగ్ బ్యాంగ్ థియరీ , గేమ్ ఆఫ్ థ్రోన్స్  సాధించిన రికార్డ్స్ రామాయణం చెరిపివేసిందది. ఈ క్రమంలో నిన్న రామాయణం అనే వర్డ్ ట్విట్టర్ లో ట్రేండింగ్ గా మారింది. అయితే కొందరు నెటిజన్లు ట్విటర్‌ వేదికగా రాజమౌళిని ట్యాగ్ చేసి సర్‌.. రామాయణం చేయండి అని పేర్కొంటూ ట్వీట్లు చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్‌ ని రాముడిగా చూడాలనుకుంటున్నామని విజ్ఞప్తి చేస్తున్నారు. నెటిజన్లు చేస్తున్న వరుస ట్వీట్లతో #RajamouliMakeRamayan అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా ట్విటర్ ఇండియా ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. నిజానికి రాజమౌళి తాను ‘మహాభారతం’ సినిమా చేస్తానని చాలా సందర్భాల్లో ప్రకటించారు. మరిప్పుడు ఈ కొత్త డిమాండ్ తో ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

More Related Stories