English   

ఇంకా ఒంటరి బతుకే అంటోన్న హిమజ

 Himaja
2020-05-04 18:21:13

తన అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానుల గుండెలను కొల్లగొట్టింది తెలుగమ్మాయి హిమజ. బిగ్ బాస్ తెలుగు 3 రియాలిటీ షోలో తనదైన శైలితో జనానికి దగ్గరయిన ఈమెకి అభిమానులు ఎక్కువే. నెక్స్ట్ నువ్వే', 'ఉన్నది ఒకటే జిందగీ' లాంటి చిత్రాల్లో నిడివి ఎక్కువ ఉన్న పాత్రలే చేసింది ఈమె. అయితే ఈమెకు గుర్తింపు తెచ్చిన సినిమాలు అంటే మాత్రం 'నేను శైలజ', 'మహానుభావుడు', 'శతమానం భవతి', 'నెక్స్ట్ నువ్వే', 'చిత్రలహరి' అని చెప్పచ్చు. అయితే  గతేడాది ప్రసారమైన ఈ షోలో హిమజ కనిపించి మెప్పించింది. షో నుండి బయటకి వచ్చిన తరువాత అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా తయారైందీమే. 

తాజాగా కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ తో ఆమె తన ఫాలోవర్స్ తో సోషల్ మీడియాలో చాట్ సెషన్ ఇస్తూ తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంది. ఒకరు 'మీకు పెళ్లి అయిందా? మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు?' అని అడిగారు. దీంతో ఆమె చాలా సంవత్సరాలుగా ఒంటరిగానే జీవితాన్ని వెళ్లదీస్తున్నానని మామూలుగా అయితే పేరెంట్స్ నాతోనే ఉంటారని కానీ లాక్ డౌన్ వలన విజయవాడలో ఇరుక్కు పోయారని చెప్పుకోచింది. అయితే ఆమె తన వయసు బయట పెట్టడానికి ఇష్టపడలేదు అనుకోండి. ఇక లాక్ డౌన్ తొలగించిన తర్వాత విజయవాడలో ఉన్న మా అమ్మమ్మ గారింటికి వెళతానని చెప్పుకొచ్చింది.  

More Related Stories