English   

ట్విట్టర్ లేదంటూ వినాయక్ ప్రకటన...కొత్త అనుమానాలు 

 Vinayak
2020-05-04 11:57:19

సోషల్ మీడియాలో అందునా ట్విట్టర్‌ లో ఇప్పుడు సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటున్నారు. మామూలుగా తమ తమ సినిమా అప్డేట్స్ ఇచ్చే ఈ ట్విట్టర్ ని ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అన్ని రకాలుగా వాడుతున్నారు. ఏదో ఒక టైమ్‌లో ట్విట్టర్‌లోకి వచ్చి తమ అభిమానులకు నిరంతరం టచ్‌ లో ఉంటున్నారు. అయితే ట్విట్టర్‌లో లేని వారిని చూసుకుని వారి పేరు మీద కూడా కొందరు ట్విట్టర్ అకౌంట్స్ రన్ చేస్తూ.. సేమ్ టు సేమ్ సెలబ్రిటీలు చేసినట్లే ట్వీట్లు చేస్తు వారి అభిమానుల దృష్టిలో ఇది నిజమైన అకౌంటే అనే భావన కలిగిస్తున్నారు. తాజాగా ఇలాంటి అనుభవం  దర్శకుడు వి.వి. వినాయక్ కు ఎదురయినట్టు ఉంది. అందుకే ఆయన తనకు ఎటువంటి ట్విట్టర్ అకౌంట్ లేదని మీడియా ముఖంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 

ఎందుకంటే నిజానికి వినాయక్ పేరుతో ఓ ట్విట్టర్ అకౌంట్ అఫీషియల్ అకౌంట్ అనేలా హల్‌చల్ చేస్తుంది. నిజంగా వినాయకే ఆ ట్వీట్స్ చేస్తున్నారని భావిస్తూ.. కొందరు సెలబ్రిటీలు కూడా ఆ ట్వీట్స్‌కి రిప్లయ్ ఇస్తున్నారంటే ఎంతలా నమ్మారో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఎప్పటికయినా తనకు ఇబ్బందే నని భావించిన వినాయక్ అది ఫేక్ అకౌంట్ అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన విడుదల చేసిన ప్రకటన మీద కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన తన వివరణను తన పీఆర్ టీమ్ ద్వారా మీడియాకి విడుదల చేశారు. నిజానికి ఆయనకు వెరిఫైడ్ ఫేస్ బుక్ పేజ్ ఉంది. అలా అది ఉన్నా ఈయన ప్రకటన ఇవ్వడం ఏమిటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు.  

More Related Stories