English   

తెలుగు సినిమాలకి ఈ పేర్లు అచ్చిరావట 

Tollywood
2020-05-04 12:17:48

టాలీవుడ్ దర్శక నిర్మాతలు ట్రెండ్ ఫాలో కావడం ఇప్పటి సంగతి ఏమీ కాదు. ఏనాటి నుండో వారు ట్రెండ్ ఫాలో కావడానికి ప్రయత్నించేవారు. కొన్నేళ్ళు క్రితం అంటే 1972 సమయంలో ఒక దశలో క్రైం, ఇన్వెస్ట్గేషన్, దెయ్యాలకు సంబందించిన ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా హిట్ అందుకుంటున్నాయని భావించి తెలుగులో కూడా ఆ కోవలోనే కొన్ని సినిమాలు చిత్రాలు ఆరంభించారు. అలా మొదలు పెట్టిన సినిమాల పేర్లు కూడా భయం కలిగించేలా ఉండేవి. అలా  ‘‘భయంకర పిశాచి’’, ‘‘అర్ధరాత్రి పన్నెండు గంటలు’’, ‘కాళరాత్రి’’, ‘‘అర్ధరాత్రి అమావాస్య’’ అనే సినిమాలు ఒకేసారి మొదలు పెట్టారు. 

అయితే ఏమయిందో ఏమో కానీ వీటిలో, ‘‘అర్థరాత్రి అమావాస్య’’ తప్ప తక్కినవన్నీ నాలుగురీళ్ళు, ఐదురీళ్ళు పూర్తి చేసుకుని ఆగిపోయాయి. అయితే ఈ సినిమాలు నిర్మాణం పూర్తి చేసుకోలేదనుకుంటే అంతా రెడీ ఇక విడుదలె తరువాయి అనుకున్న అర్థరాత్రి అమావాస్య కూడా విడుదల కాలేదు. దీంతో అప్పట్నుంచి పరిశ్రమలో ఒక సెంటిమెంట్ ఏర్పడి పోయింది. ‘‘సినిమాలకి ఇలాంటి పేర్లు పెడితే పూర్తికావు. డబ్బు, సమయం అంతా నష్టమే అని భావించి ఆ పేర్లు అచ్చిరావనే ముద్ర వేసేశారు నిర్మాతలు. ఇక ఈ మధ్య కాలంలో ఈ పేర్లతో కొన్ని సినిమాలు వచ్చినా అవి రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు. 

More Related Stories