English   

ఆర్ఆర్ఆర్ నుండి మరో లీక్..రివీల్ చేసిన ఫైట్ మాస్టర్ 

 RRR
2020-05-04 16:28:36

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఎన్టీఆర్,రామ్ చరణ్ కలయికలో మొదటి సినిమా కావడం అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్ వంటి చారిత్రక పాత్రలను ఆ ఇద్దరూ పోషించడంతో సినిమాపై మొదలు కాక ముందు నుండే క్యురియాసిటీ నెలకొంది. ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే మొదట్లో ఈ సినిమా సెట్స్ లో నుండి కొన్ని పిక్స్ లీక్ కావడంతో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఆ లీక్స్ ఏమాత్రం ఆగడం లేదు. ఆ మధ్య ఎన్టీఆర్ ను చరణ్ కొడతారు అనే ఒక సంచలన విషయం బయటకు రావడంతో దానిని కవర్ చేసుకునే పనిలో పడింది సినిమా యూనిట్. అయితే అప్పటికే అవ్వాల్సిన నష్టం అంతా అయిపొయింది. 

అయితే తాజాగా మరో లీక్ వచ్చింది ఈ ఆర్ఆర్ఆర్ నుండి. నిజానికి మీరు గమనిస్తే రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన రామరాజు పాత్ర టీజర్ లో రామ్ చరణ్ బాణం, బందూక్ మరియు బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నట్టుగా కొన్ని ఫేడవుట్ షాట్స్ ఉన్నాయి. అయితే దానిని జనం పెద్దగా పట్టించుకోలీడు. కానీ దాని వెనకున్న విషయాన్ని ఈ సినిమాకి బాక్సింగ్ సీన్స్ కంపోజ్ చేసిన కుల్దీప్ రివీల్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్ లో బాక్సింగ్ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అవినేనే డిజైన్ చేసి, కంపోజ్ చేసాను. స్క్రీన్ మీద ఆ సీన్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని రాజమౌళి గారి సినిమా చేయడం ఎంత సంతోషంగా ఉందో అంతే గర్వంగా కూడా ఉందని’ కుల్దీప్ ఒక ట్వీట్ చేశారు.

More Related Stories