English   

అయ్యో నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా.. 

 Nikhil Siddharth
2020-05-04 16:39:27

వరస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నిఖిల్. ఈయన త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ పెళ్లి కాస్తా రెండోసారి కూడా వాయిదా పడింది. ఇప్పటికే ఎప్రిల్ 16న జరగాల్సిన పెళ్లిని కరోనా కారణంగా వాయిదా వేసారు. మే 14న అనుకున్నా కూడా ఇప్పుడు కూడా మరోసారి లాక్ డౌన్ పొడగింపుతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు నిఖిల్. దీనిపై ఈయన స్పందించాడు కూడా. రెండుసార్లు పెళ్లి వాయిదా పడటం వలన నిరాశ చెందానని.. అయితే నా పెళ్లి వల్ల ఒక్కరికీ ఇబ్బంది వచ్చినా తాను సంతోషంగా ఉండలేనని.. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకంగా ఉంటుందని చెప్పాడు. అందుకే అది మంచిగానే ఉండాలని ఆశిస్తున్నానని.. కరోనా వైరస్‌ నియంత్రణలోకి వచ్చాక ఘనంగా పెళ్లి చేసుకుంటానాని నిఖిల్ వెల్లడించాడు. 

మొన్నటికి మొన్న నితిన్ చేసిన పనే ఇప్పుడు నిఖిల్ కూడా చేసాడు. ఏ కరోనా నా పెళ్లికి అడ్డు కావు అని ఆ మధ్య చెప్పిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు ఇదే కరోనా కారణంగా తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఇదే విషయం అఫీషియల్ గా ప్రకటించాడు నిఖిల్. కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. నిఖిల్ తాను ప్రేమించిన పల్లవి వర్మను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈమె డాక్టర్.. కొన్ని రోజులుగా పల్లవితో ప్రేమలో ఉన్నాడు నిఖిల్. ఈ విషయం ఇంట్లో చెప్పి రెండు ఫ్యామిలీస్ ను ఒప్పించాడు ఈ కుర్ర హీరో. అందరిముందే ప్రపోజ్ చేసి తన ప్రేమను చూపించాడు నిఖిల్. మొన్నామధ్య నిశ్చితార్థం కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పెళ్లి డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సమ్మర్ లో అనుకున్నా కరోనా కాటేసింది. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు నిఖిల్ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఈయన కార్తికేయ 2, సుకుమార్ 18 పేజెస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే నిఖిల్ నటించిన అర్జున్ సురవరం మంచి విజయం సాధించింది.

More Related Stories