చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కేసిన రాశీ ఖన్నా.. సూర్యతో రొమాన్స్..

రాశీ ఖన్నా.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో చాలా సినిమాలు చేసింది.. ఇక్కడ విజయాలు కూడా అందుకుంది. కానీ ఇప్పుడు లేవు కదా.. అందుకే మనోళ్లు పట్టించుకోవడం మానేసారు. శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న రాశీ.. గతేడాది వరసగా వెంకీ మామ, ప్రతిరోజూ పండగే సినిమాలతో హిట్స్ కొట్టింది. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ కావడం.. ఈ సినిమా అనవసరంగా చేసానని అమ్మడు ఫీల్ అవ్వడం కూడా జరిగిపోయాయి. దాంతో తెలుగులో ఫోకస్ తగ్గించేసింది. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది రాశీఖన్నా. రెండేళ్ల కింది వరకు తెలుగు తప్ప మరో భాషలో సినిమాలే చేయని రాశీఖన్నా.. ఇప్పుడు తమిళ, మలయాళ భాషలపై కూడా ఫోకస్ పెట్టింది.
విలన్ సినిమాతో కేరళకు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ తొలి సినిమాతోనే షాక్ తినేసింది. దాంతో ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ గతేడాది జయం రవి హీరోగా సుభాష్ సినిమాలో నటించింది రాశీ ఖన్నా. ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు అక్కడ సుందర్ సి తెరకెక్కిస్తున్న అరణ్మణై 3తో పాటు సూర్య హీరోగా సింగం సిరీస్ మాస్ డైరెక్టర్ హరి తెరకెక్కించబోయే సూరారై పొట్రు సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది రాశీ ఖన్నా. తెలుగులో కూడా రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలిపింది రాశీ. మొత్తానికి ఛాన్స్ ఉన్నపుడు తెలుగులో నటిస్తూనే.. ఆల్టర్ నేటివ్ గా మరో ఇండస్ట్రీని కూడా ఫోకస్ చేసింది రాశీ ఖన్నా. మరి అక్కడ ఈ భామ జాతకం ఎలా ఉండబోతుందో చూడాలిక..!