హిట్టిచ్చినా ఫ్లాపిచ్చినా సూర్య సింగమే బాబోయ్..

ఒక్క ఫ్లాప్ వచ్చినా.. పది ఫ్లాపులు వచ్చినా స్టార్ హీరోకు వచ్చే నష్టమేమీ ఉండదు. అది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు సూర్య విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయనకు కొన్నేళ్లుగా ఫ్లాప్ తప్ప హిట్ లేదు. వచ్చిన సినిమా వచ్చినట్లే చాప చుట్టేస్తుంది. కానీ సూర్య కోసం దర్శకుల క్యూ మాత్రం తగ్గట్లేదు. ఒకటి రెండు కాదు.. సూర్య కోసం ఏకంగా ఆరు సినిమాలు.. అరడజన్ దర్శకులు వేచి చూస్తున్నారిప్పుడు. ఈయన ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశమే హద్దుగా సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఈ సినిమాతో పటు హరి.. విక్రమ్ కే కుమార్ లాంటి దర్శకులు కూడా సూర్య కోసం కథలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. సూర్యుడు ఉదయించిన వేళ అంటూ అన్నీ కొత్త కథలతోనే వస్తున్నారు దర్శకులు. ఈయన కూడా వాళ్ల కథలు ఫైనల్ చేసి.. మీరు క్యూలో ఉన్నారు అంటున్నాడు. మొత్తానికి ఈయన దూకుడు చూసి హిట్స్ లో ఉన్న హీరోలకు కూడా షాకులు తప్పట్లేదు. ఫ్లాపుల్లోనే ఇంతగా సత్తా చూపిస్తున్నాడు సూర్య. అలాంటిది ఈయనకు కానీ ఒక్క హిట్ వచ్చిందంటే అందర్నీ మడతపెట్టేస్తాడు.