English   

ఫేక్ న్యూస్ రాస్తున్న వెబ్‌సైట్స్‌పై విజయ్ దేవరకొండ ఫైర్..

Vijay Devarakonda
2020-05-05 09:27:56

చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మళ్లీ కోపంతో ఊగిపోయాడు. ఈ మధ్య చాలా కూల్ గా కనిపిస్తున్న ఈయన చాలా రోజుల తర్వాత తన ఉగ్రరూపం చూపించాడు. ఎంతగా అంటే చూసే వాళ్లు కూడా భయపడేలా రెచ్చిపోయాడు విజయ్. ఫేక్ న్యూస్ రాస్తూ.. తమ జీవితాలతో ఆడుకుంటున్నారంటూ తెలుగులో కొన్ని వెబ్ సైట్లపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తన పేరు నాశనం చేస్తున్నారని.. కక్ష్య కట్టి తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యాడు. అసలు వాళ్లకేం అర్హత ఉందని వెబ్ సైట్ నడిపిస్తున్నారు.. ఏం డిగ్రీ ఉందని తమపై యిష్టమొచ్చినట్లు రాస్తున్నారు.. ఓ 150 రూపాయలు పెట్టి వెబ్ సైట్ పేరు.. 3 వేలు పెట్టి సర్వర్ కొని ఇంట్లో కూర్చుని యిష్టమొచ్చినట్లు రాస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించాడు విజయ్ దేవరకొండ. 

ఫలానా వెబ్ సైట్స్ కొన్ని నెల రోజులుగా తనపై యిష్టమొచ్చినట్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని.. అందులో ఒక్కటి కూడా నిజం లేదని.. ఐదో తరగతి పిల్లోడికి కూడా అర్థమయ్యేలా తమ మిడిల్ క్లాస్ ఫండ్ వెబ్ సైట్ డిజైన్ చేస్తే వీళ్లకు మాత్రం అర్థం కాలేదని చెప్పాడు విజయ్. బురద జల్లడానికి కాకపోతే ఇంత బాగా లెక్కలు కూడా వేచి చూపించిన తర్వాత తనపై రాసిన వార్తలను ఏమనాలంటున్నాడు ఈయన. ఇంట్లో కూర్చుని ఇలాంటి చెత్త రాయడానికి 2 నిమిషాలు పట్టదని.. కానీ అక్కడ మేం 7500 కుటుంబాలను ఆదుకుంటున్నామని.. అది మీకు ఓన్లీలా కనిపిస్తుందా అంటూ ఫైర్ అయ్యాడు ఈయన. ఈ విషయంపై దాదాపు 20 నిమిషాల వీడియో పోస్ట్ చేసాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. 

More Related Stories