English   

విజయ్ నీకు తోడుగా మేమున్నాం.. టాలీవుడ్ సపోర్ట్..

Mahesh Raviteja
2020-05-05 09:49:49

విజయ్ దేవరకొండ తనకు తెలిసో తెలియకో పెద్ద యుద్ధమే మొదలుపెట్టాడు. ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఫేక్ న్యూస్, గాసిప్స్ పెరిగిపోతున్నాయంటూ చాలా మంది చెబుతూనే వచ్చారు. అయితే ఎవరూ బహిరంగంగా మాట్లాడలేదు. అలా చేయడం లేదంటే తమ పనులు మానుకుని మీరు రాసే చెత్త గురించి చెప్పుకోలేక అంటున్నాడు విజయ్. అలా చేస్తూ పోతే తమ టైమ్ అంతా దీనికి అయిపోతుందంటూ ఫైర్ అయ్యాడు విజయ్. చివరికి ఈయనే సైలెన్స్ బ్రేక్ చేసాడు. ఫేక్ న్యూస్ రాస్తున్న వెబ్ సైట్స్.. వాళ్లు రాసిన ఆర్టికల్స్ కూడా తీసుకుని మీడియా ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. 

తెలుగులో వెబ్‌సైట్లు కావాలనే విపరీతంగా తప్పుడు వార్తలు రాస్తున్నాయని.. అందులో ముఖ్యంగా రెండు మూడు వెబ్‌సైట్స్ మాత్రం ఏ మాత్రం అర్హత లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే కూడా కక్ష్య పెట్టుకుని రాస్తున్నారంటూ మండిపడ్డాడు ఈయన. కొందర్ని మనసులో పెట్టుకుని వాళ్లపై కావాలనే కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారంటూ ఆయన మండి పడ్డాడు. వాళ్లు అడిగినట్లు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే లేదంటే సినిమా యాడ్స్ ఇవ్వకపోతే వాళ్ల విలువలు కూడా పక్కనబెట్టి చెత్త వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యాడు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ అంతా సపోర్టుగా నిలిచింది. విజయ్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. మహేష్ బాబు, రవితేజ, హరీష్ శంకర్, బివిఎస్ రవి, రానా దగ్గుబాటి ఇలా చాలా మంది విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచారు. ఇదింకా ఎంత దూరం వెళ్తుందో తెలియదు.. కానీ చాలా దూరం మాత్రం వెళ్తుందని ఈ వేడి చూస్తుంటే అర్థమైపోతుంది. 

More Related Stories