English   

అందరి కళ్లు ఆ ఫలానా వెబ్‌సైట్‌పైనే..

Vijay Devarakonda
2020-05-05 10:53:43

తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్న ఒక నిప్పురవ్వ ఇప్పుడు రాజుకుంది. అది కాస్త పెద్ద జ్వాలలా మారే సమయం దగ్గర పడింది. దాన్ని అంటించింది విజయ్ దేవరకొండ.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో తప్పుడు వార్తలు రాసే వెబ్ సైట్స్ ఎక్కువగా అయిపోయాయని చాలామంది చెబుతూనే ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా ఒక వెబ్సైట్ గురించి మాత్రం ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఒక ముసలి జర్నలిస్టు అందులో తప్పుడు వార్తలు రాస్తున్నాడని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అది కేవలం ఒక వెబ్ సైట్ గురించి మాత్రమే. వాళ్లు పూర్తిగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. అందరూ వాళ్ళ బాధితులే అంటూ విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళు అడిగినప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే.. యాడ్స్ ఇవ్వకపోతే వెంటనే నెగటివ్ ఆర్టికల్ ఇచ్చేస్తుంది ఆ వెబ్ సైట్ అంటూ మండిపడ్డాడు విజయ్ దేవరకొండ. 

ఆ ఒక్క వెబ్ సైట్ గురించి ఇంతకుముందు కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా సంపూర్ణేష్ బాబుతో హృదయ కాలేయం సినిమా తెరకెక్కించిన స్టీఫెన్ శంకర్ అలియాస్ సాయి రాజేష్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఏకంగా పేరు పెట్టి మరి రెచ్చిపోయాడు. ఆయనతో పాటు మరికొందరు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆ ఫలానా వెబ్ సైట్ గురించి ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండపై వచ్చిన ఆర్టికల్స్ వెనక ఇద్దరు మీడియా సినిమా ప్రతినిధులు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. వాళ్ళు ఇంతకు ముందు విజయ్ దేవరకొండతో కలిసి పని చేశారు. ప్రత్యేకంగా ఇద్దరు ప్రతినిధులు ఆ వెబ్ సైట్ పెద్దలకు వెన్నుదన్నుగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ బయటికి రావడంతో వాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. ఏదేమైనా కూడా విజయ్ దేవరకొండ నిప్పు రవ్వ ఒకటి అంటించాడు. అది ఎంత పెద్దగా మండుతుందో చూడాలి. 

More Related Stories