ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తోన్న బన్నీ

బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమై తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. అయితే తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన ఆ తరవాత సినిమాలన్నీ వరసగా విఫలమవడంతో డైరెక్టర్స్ లిస్ట్ నుండి తప్పుకున్నారు. చరణ్ తో ఆయన తీసిన ఆరెంజ్ సినిమా ఆయన కెరీర్ కి పెద్దదెబ్బకొట్టింది. ఆ తర్వాత రామ్ తో ఒంగోలు గిత్త సినిమా తీసినా అది కూడా పెద్దగా ఆడకపోవడంతో భాస్కర్ ఆరేళ్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తమిల్ లో ఒక సినిమా చేసినా అది కూడా పెద్దగా ఆడలేదు. అయితే మొత్తం మీద అఖిల్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ క్రమంలో మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అదేంటంటే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పరుగు’ అనే లవ్ స్టోరీ హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా దర్శకులంతా కొత్త కథలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. భాస్కర్ కూడా తదుపరి ప్రాజెక్టు కోసం బన్నీని ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు అర్జున్.