English   

హిరణ్య కశ్యప ఆగలేదట...క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

 Rana Hiranyakashipu
2020-05-05 11:27:51

యంగ్ హీరో రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా విరాటపర్వం. నీది నాది ఒకే కథ సినిమా ఫేం దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నక్సలైట్ ఉద్యమం నేపథ్యంతో 1990ల నాటి కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కుతోందని చెబుతున్నారు. ఈ మధ్య సినిమా షూటింగ్ కరోనా వలన బ్రేక్ పడింది. కానీ దాదాపు చాలావరకూ షూట్ పూర్తి చేసుకుంది. ఇక మరోపక్క రానా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'హిరణ్య కశ్యప' సినిమా గురించి ఆసక్తికర న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. 

రానా హోమ్ బ్యానర్‌లో భారీ బడ్జెట్ తో ‘హిరణ్య కశ్యప’ చేయాల్సి ఉంది. ఒకప్పటి అగ్రశ్రేణి డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించనున్న ఈ మైథలాజికల్ మూవీని.. సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. అయితే ఆ మధ్య ‘హిరణ్య కశ్యప’ ఆగిపోయినట్టు కొన్ని వెబ్ సైట్స్ లో ప్రచారం గట్టిగా జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘హిరణ్య కశ్యప’ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని సురేష్ బాబు పేర్కొన్నారు. మొత్తానికి సురేష్ బాబు క్లారిటీతో హిరణ్య కశ్యప మీద వస్తున్న గాసిప్స్ కు బ్రేక్ పడినట్లయింది.

More Related Stories