English   

పవర్ పేటకి మణిశర్మ స్వరాలు

Mani Sharma
2020-05-05 12:10:29

ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఒప్పుకుని నటిస్తూ బిజీగా ఉన్నాడు నితిన్‌. మొన్ననే భీష్మ హిట్ కొట్టిన ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ కరోనా కాటు వేయడంతో అది కూడా వాయిదా పడింది. ఇక ఆయన చేస్తున్న తదుపరి సినిమా `రంగ్ దే`. ఇక ఇది కాక ఛ‌ల్ మోహ‌న రంగ‌` త‌రువాత నితిన్, ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య కాంబినేష‌న్‌లో ‘ప‌వ‌ర్ పేట’ పేరుతో మ‌రో చిత్రం రాబోతోంది. ఈ సినిమాలోనే కీర్తి సురేష్ హీరోయిన్‌గా క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌ని తెలిసింది. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘వడ చెన్నై’ తరహాలోనే ఈ సినిమా రూపొందనుంద‌ని టాక్. అంతేకాక ఏకంగా ఈ సినిమా రెండు భాగాలుగా తెర‌కెక్కనుంద‌ని కూడా అంటున్నారు. ఇక ఈ సినిమాలో విలన్‌గా రావు రమేష్ నటించనున్నాడని అంటున్నారు. ఆ విషయాలు పక్కన పెడితే ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నట్టు చెబుతున్నారు. 

ఇటీవలే సినిమా యూనిట్ మణిశర్మని సంప్రదించిందని, ఆయనకు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. గతంలో నితిన్‌- మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన పాటలు బాగా కుదరడంతో మరోసారి వస్తోన్న ఈ కాంబినేషన్‌ మీద ఆసక్తి పెరుగుతోంది. ఇక చిరంజీవి హీరోగా శివ కొరటాల దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’, పూరి జగన్నాథ్‌- విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఫైటర్‌’కు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించబోయే పవర్ పేట రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ వేసవిలో ప్రారంభం కావాల్సి ఉంది. నిజానికి ఈ సినిమాని ముందు నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్‌లో నిర్మించాల‌నుకున్నారు. అయితే ఏమయిందో ఏమో ఆ ప్రాజెక్ట్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ వ‌ద్దకు వెళ్లింది. అక్కడి నుండి ప‌వ‌ర్‌పేట‌ చేతులు మారి పీపుల్ మీడియా వారి ద‌గ్గరికి చేరింది.  

More Related Stories