English   

బాలకృష్ణకు తమ్ముడిగా వంగవీటి 

Balakrishna
2020-05-05 12:23:14

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నిజానికి అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరిలోనే సెట్స్‌ పైకి వెళ్ళాల్సి ఉంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి జరగనుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏమయిందో ఏమో కానీ ఈ సినిమా షూటింగ్ లేట్ గా మార్చ్ నెల మొదట్లో మొదలయింది. ఆ మొదటి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోండగా కరోనా కాటు వేసింది. అయితే ఈ సినిమా కధ ప్రకారం వారణాసిలో కూడా షూట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని ఒక పాత్ర అఘోరా పాత్ర అని మరో పాత్ర నార్మల్ పాత్ర అని స్వయంగా బోయపాటే క్లారిటీ ఇచ్చేశారు. 

 అయితే ఈ సినిమాలో ఆయనకు సోదరుడిగా నటించేందుకు ఓ యువ కథానాయకుడికి అవకాశముందట. నిన్నమొన్నటి వరకు ఆ పాత్ర నవీన్‌ పొలిశెట్టి చేస్తున్నట్లు వార్తలు రాగా అది నిజం కాదని ఆ యువ హీరో ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ పాత్ర పోషించబోయేదవరనే దాని మీద ఓ క్లారిటీ వచ్చింది. వంగవీటి, జార్జిరెడ్డి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సందీప్‌ మాధవ్‌ (సాండీ) ఇప్పుడు బాలయ్య తమ్ముడిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పాత్ర విషయమై ఆయనతో చర్చించగా ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పూర్తిగానే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

More Related Stories