English   

నారా రోహిత్ కొత్త లుక్...ఆ సినిమా కోసమేనట 

Nara Rohit
2020-05-05 12:49:13

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా బలం లేకుండానే ‘బాణం’లా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్‌ ఆ తరువాత ‘సోలో’గా నటించి తనకంటూ ఒక సెపరేట్ పంధా ఏర్పరచుకున్నారు. వైవిధ్యమైన కథల్లో మాత్రమే నటిస్తూ మెప్పిస్తున్న నారా రోహిత్‌ గత సినిమాలేవీ చేయకుండా సైలెంట్ అయ్యాడు. చివరిగా ఆయన 2018లో వచ్చిన ‘ఆటగాళ్లు’, ‘వీరభోగవసంత రాయలు’లో కనిపించాడు. అయితే కెరీర్ మొదలు పెట్టినప్పుడు చాలా సన్నగా ఉన్న ఆయన ఆ అనంతరం బొద్దుగా తయారయ్యాడు రోహిత్‌. అయితే తాజాగా ఆయన కొత్తలుక్‌తో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. రోహిత్‌ త్వరలోనే ఓ చిత్రంలో నటించడానికి సిద్ధమైయ్యాడని, అందుకే ఇలా కొత్తగా కనిపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఆ సినిమా ఎవరిదీ అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 

బాణం చిత్రం దర్శకుడు చెైతన్య దంతులూరి దర్శకత్వంలో 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ సినిమాలో నారా రోహిత్ నటించబోతున్నాడని అంటున్నారు. కరోనా తగ్గాక ఈ చిత్రం పట్టాలెక్కనుందని అంటున్నారు. దర్శకుడిగా చెైతన్య తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతోనే చెైతన్య మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత బసంతి సినిమాతో మళ్ళీ గట్టిగానే ట్రై చేసినా అది వర్కౌట్ కాలేదు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. ఈసారి ఎలా అయిన హిట్ కొట్టాలని ఇద్దరూ గట్టిగా try చేస్తున్నారు. ఇక ఈ సినిమాని రోహిత్ తన సొంత బ్యానర్ అరన్ మీడియా వర్క్స్ మీద తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. 

More Related Stories