English   

డియర్ విజయ్.. నీ వెంటే ఉన్నామంటున్న చిరంజీవి..

Chiranjeevi
2020-05-05 15:59:44

విజయ్ దేవరకొండ మొదలు పెట్టిన యజ్ఞంలో అంతా భాగం అవుతున్నారు. ఇండస్ట్రీలో ఫేక్ న్యూస్ రాస్తున్న కొన్ని వెబ్ సైట్స్ పూర్తిగా చదవడం మానేయాలని.. కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చేసిన వాదనకు ఇప్పుడు ఇండస్ట్రీ అంతా సపోర్టుగా నిలిచింది. ఇప్పటికే చాలా మంది హీరోలు, దర్శకులు ఆయనకు తోడుగా ట్వీట్స్ చేసారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే చేసాడు. డియర్ విజయ్ మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటూ ట్వీట్ చేసాడు మెగాస్టార్. గతంలో తనపై కూడా చాలా వరకు ఇలాంటి తప్పుడు వార్తలు రాసారని గుర్తు చేసుకున్నాడు చిరంజీవి. దయచేసి జర్నలిస్ట్ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలని.. లేనిపోని వార్తలు నిరాధారంగా ఉన్న వార్తలను రాసి తమ వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దంటూ కోరాడు చిరంజీవి. ఏదేమైనా కూడా చిరంజీవి కూడా సపోర్ట్ చేయడంతో విజయ్ పోరాటానికి మరింత బలం వచ్చింది. 

More Related Stories