English   

ఇండస్ట్రీ రక్తాన్ని పీల్చేస్తున్నారంటూ నాగబాబు ట్వీట్.. 

 Naga babu
2020-05-05 16:51:29

విజయ్ దేవరకొండ ఫేక్ న్యూస్ పై చేసిన పనికి అంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన ప్రశ్నలతో అంతా స్వరం కలుపుతున్నారు. ముఖ్యంగా విజయ్‌కు మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు నిలిచాడు. ఈయన ట్వీట్ చూస్తుంటే తప్పుడు వార్తలపై రాసే వాళ్లపై నాగబాబుకు ఎంత కోపం ఉందనేది అర్థమైపోతుంది. హాయ్ విజయ్.. నేను నీకు బలంగా మద్దతిస్తున్నాను.. సినిమా పరిశ్రమ రక్తాన్ని పీల్చే కొన్ని వెబ్‌సైట్లపై పోరాటం చేయడం అనేది, వాటిపై స్పందించడమనేది ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.. నువ్వు స్పందించినందుకు థ్యాంక్స్.. టైమ్ టు టేక్ యాక్షన్ మై బాయ్ అని రాసుకొచ్చాడు ఈయన. 

నాగబాబుతో పాటు హీరోయిన్లు రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్, సీనియర్ హీరోయిన్ రాధికా లాంటి వాళ్లు కూడా ట్వీట్స్ చేసారు. ఇకపై ఉపేక్షించేది లేదని.. యాక్షన్ తీసుకోడానికి టైమ్ దగ్గర పడిందని అంతా ఒకే మాట చెబుతున్నారు. మహేష్ బాబు, చిరంజీవి, రవితేజ లాంటి హీరోలు కూడా సపోర్టుగా నిలవడంతో విజయ్ కు వెయ్యి ఏనుగుల ధైర్యం వచ్చినట్లయిందిప్పుడు. అంతా నీ వెంటే ఉంటాం విజయ్ అంటూ సపోర్ట్ చేస్తుండటంతో విజయ్ దేవరకొండ కూడా అందరికీ రిప్లై ఇస్తున్నాడు. కచ్చితంగా దీన్ని ఎక్కడో ఓ చోట అయితే ఆపాల్సిందే అంటూ రాసుకొచ్చాడు. మరి చూడాలిక.. ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో..? 

More Related Stories