విజయ్ దేవరకొండపై సంచలన సెటైర్ వేసిన అనసూయ..

తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని విజయ్ దేవరకొండ చేస్తున్న రచ్చ అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా ఆయనకు సపోర్టుగా నిలిచింది. నీ వెంటే మేమున్నామంటూ వాళ్ళంతా నడుస్తున్నారు. అయితే ఇప్పుడు అనసూయ భరద్వాజ్ మాత్రం సంచలన సెటైర్ వేసింది. మన వరకు వచ్చేదాకా తెలియదన్న మాట.. హమ్ అంటూ ట్వీట్ చేసింది అనసూయ. దీనిపై ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే అనసూయ అడిగిన దాంట్లో కూడా తప్పు లేదు కదా అంటూ కొందరు సపోర్ట్ చేస్తున్నారు.
నిజంగానే మన వరకు వచ్చేదాకా తెలియదు కదా.. ఇండస్ట్రీలో చాలా మందిపై ఇలా ఫేక్ న్యూసులు రాసారు.. అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు విజయ్ కోసం లేస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరి దీనికి సమాధానం చెప్పేదెవరు..? నిజానికి విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య వైరం నేటిది కాదు.. అర్జున్ రెడ్డి సమయంలో నుంచే ఉంది. అయితే తర్వాత అంతా కూల్ అనుకున్నారు.. విజయ్ నిర్మించిన మీకు మాత్రమే చెప్తాలో అనసూయ నటించింది కూడా. అయితే ఇప్పుడు మరోసారి ఆమె పోస్ట్ చేసేసరికి అదింకా అలాగే ఉందన్నమాట అని అర్థమైపోయింది. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అనసూయతో ఆడుకుంటున్నారు.