English   

పాపం హెబ్బా పటేల్.. కెరీర్ కోసం చివరికి అలా.. 

 Hebah Patel
2020-05-05 17:47:15

కుమారి 21 ఎఫ్ తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న‌ ఈ ముద్దుగుమ్మ దానికి ముందే ఓ సినిమా చేసింది కానీ అది ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కుమారి త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ లేదు ఈ భామ‌కు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా హిట్టైనా కూడా అందులో నందితా శ్వేతా క్రెడిట్ అంతా ప‌ట్టుకుపోయింది. మ‌ధ్య‌లో కొన్ని సినిమాలు చేసినా కూడా ఏది పెద్దగా క్లిక్ అవ్వ‌లేదు. వ‌రుణ్ తేజ్ లాంటి క్రేజీ హీరోల‌తో న‌టించినా హెబ్బాకు ఒరిగిందేమీ లేదు. పైగా అమ్మాయిగారు ఆంటీలా మారిపోయారు ఈ మ‌ధ్య‌. భ‌యంక‌రంగా బ‌రువు పెరిగిపోవ‌డంతో హెబ్బాకు అవ‌కాశాలే రావ‌ట్లేదు. దాంతో ఫిజిక్ పై బాగా సీరియ‌స్ గా దృష్టి పెట్టింది ఈ కుమారి. దీనికి ఫ‌లితం ఇప్పుడు క‌నిపిస్తుంది. 

గ‌తంతో పోలిస్తే చాలా బ‌రువు త‌గ్గిపోయింది ఈ భామ‌. పైగా అందాలు ఆర‌బోస్తూ తాజాగా ఓ ఫోటోషూట్ కూడా చేసింది. ఆ మధ్య 24 కిస్సెస్ సినిమాలో 24 ముద్దులు పెట్టినా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో హాట్ షోపై ఆధారపడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇది చూసిన త‌ర్వాత క‌చ్చితంగా హెబ్బాకు మ‌ళ్లీ అవ‌కాశాలు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇప్పటికే ఆహా యాప్‌లోని మస్తీస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది హెబ్బా. ఇక త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ తీయబోయే రెండు వెబ్‌ సిరీస్‌లకు సైన్‌ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెండు వెబ్‌ సిరీస్‌లు అడల్ట్‌ కంటెంట్‌ స్టైయిల్లో ఉంటుందని.. హెబ్బా బోల్డ్‌ క్యారెక్టర్‌ చెయ్యబోతోందని తెలుస్తుంది. ఇక రామ్‌ 'రెడ్‌' సినిమాలో స్పెషల్ సాంగ్.. రాజ్‌ తరుణ్‌ 'ఒరేయ్‌ బుజ్జిగా'లో ప్రత్యేక ప్రాతలో హెబ్బా మెరుస్తుంది హెబ్బా. 

More Related Stories