English   

శ్రీ ముఖి మీద కేసు...ఎందుకంటే ?

sree
2020-05-05 19:18:03

తెలుగు బుల్లితెర మీద లీడింగ్ యాంకర్స్ అంటే సుమ ఆమె తరవాత ‘జబర్దస్త్’ షోతో అనసూయ, రష్మి బాగా పాపులర్ అయ్యారు. ఇక, నటిగా ప్రయాణం ప్రారంభించి యాంకర్‌ గా మారిన బొద్దుగుమ్మ శ్రీముఖి కూడా ‘పటాస్’ షోతో మంచి పాపులారిటీ సంపాదించారు. ఆమె 'బిగ్ బాస్ 3' సీజన్ లో పాల్గొని ఇంకా పేరు సంపాదించింది. నిజానికి ఒకరకంగా ఆమె విన్నర్ అనే అనుకున్నా చివరికి రాహుల్ ని ఆ టైటిల్ వరించింది. ఇక తాజాగా శ్రీముఖి మీద బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదయింది. నల్లకుంటకు శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ప్రముఖ టెలివిజన్‌ చానల్‌ జెమిని టీవీలో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించిన జు లకటక అనే ఒక కామెడీ షోలో బ్రాహ్మణులను కించపరిచినట్టు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ శర్మ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.ను శర్మ ఫిర్యాదు మేరకు శ్రీముఖితోపాటు, జెమిని టీవీ యాజమాన్యంపై పోలీసులుకు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

More Related Stories