English   

విజయ్ కి ఇచ్చిన సపోర్ట్ పవన్ కి ఎందుకు ఇవ్వలేదు.. అభిమానుల సూటి ప్రశ్న..

vijay
2020-05-05 19:58:51

ఇండస్ట్రీలో కొందరి గురించి ఫేక్ న్యూస్ లు రాస్తున్నారు.. కావాలనే కొందరు పరువు దిగజారుస్తున్నారు అంటూ కొన్ని వెబ్ సైట్లపై పై విజయ్ దేవరకొండ మొదలుపెట్టిన యుద్ధానికి తెలుగు ఇండస్ట్రీ మొత్తం కదిలి వస్తుంది. నీ వెంట మేమున్నామంటూ చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నాగబాబు అయితే ఒక అడుగు ముందుకేసి యాక్షన్ తీసుకోవాల్సిన సమయం దగ్గరికి వచ్చింది.. సినిమా వల్ల రక్తాన్ని పీల్చేస్తున్నారు అని పెద్దపెద్ద మాటలు కూడా వాడేశాడు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు అభిమానులు మాత్రం ఒక సూటి ప్రశ్న అడుగుతున్నారు. ఇండస్ట్రీలో కేవలం విజయ్ దేవరకొండపై మాత్రమే ఫేక్ న్యూస్ లు వచ్చాయా.. ఆయన పరువు మాత్రమే తీసే వార్తలు రాశారా.. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ను ఎంతోమంది టార్గెట్ చేశారు.. ఆయన పరువు దిగజార్చేలా మాట్లాడారు.. చివరికి అతని తల్లిని కూడా దూషించారు.. రోజుల తరబడి పవన్ కళ్యాణ్ మీద డిబేట్ లు నడిపించారు..

అప్పుడు బయటికి వచ్చి పవన్ కళ్యాణ్ ఫిలిం చాంబర్ లో చాలా పెద్ద గొడవ చేశాడు.. మరి ఎప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అంతా ఎక్కడికి వెళ్లారు అని అభిమానులు అడుగుతున్నారు. ఈ రోజు విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టగానే ఇండస్ట్రీ మొత్తం మేమున్నామంటూ సపోర్ట్ చేశారు.. ఇది కూడా మంచిదే.. తోటి హీరో కష్టం వచ్చినప్పుడు అందరూ స్పందించడం మంచి పనే అంటూనే.. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ స్వయంగా తానే వచ్చి నిలబడినప్పుడు అందరూ ఎందుకు సపోర్ట్ చేయలేదు.. ఆయన కూడా సినిమా హీరోనే కదా తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చాడు కదా.. మరి ఆయన బాధ అప్పుడు మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు.. ఆయనపై తప్పుడు వార్తలు రాస్తున్న వెబ్ సైట్ కానీ న్యూస్ ఛానల్ ను కానీ మీరు ఎందుకు నిలదీయలేదు అంటూ అభిమానులు అడుగుతున్నారు. మరి దీనిపై ఎవరు సమాధానం చెబుతారో చూడాలి.

More Related Stories