English   

అలియా భట్ రూమర్స్‌పై రాజమౌళి క్లారిటీ..

alia
2020-05-06 07:24:26

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ రౌద్రం రుధిరం రణం.. RRR. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు. జూనియర్ కోసం హాలీవుడ్ నుంచి ఒలివియా మోరీస్ ను తీసుకొస్తే.. చరణ్ కోసం బాలీవుడ్ నుంచి అలియాను తీసుకొచ్చాడు రాజమౌళి. ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది అలియా. అయితే ఆర్ఆర్ఆర్ నుంచి అలియా తప్పుకుందని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఇప్పుడు చెక్ పెట్టేసాడు రాజమౌళి. ఈ సినిమాలో అలియా ఉందని క్లారిటీ ఇచ్చాడు. అసలు సీత పాత్రకు ఆలియాను ఎందుకు తీసుకున్నామనేది కూడా క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. సీత పాత్ర పోషించే అమ్మాయి.. తారక్, రామ్‌ చరణ్ వంటి ప్రతిభావంతులైన నటుల మధ్య నిలబడాలి.. అంత సత్తా ఉండాలి.. అలా అని ఇదేం ముక్కోణపు ప్రేమకథ కాదు.. సీత అమాయకంగా ఉండాలి.. అలాగే ప్రమాదకారిగా ఉండాలని చెప్పాడు. చురుకుగానూ కనిపించాలి.. స్క్రీన్ పై ఉత్సాహంగా ఉండాలి.. అందుకే ఈ పాత్ర కోసం ఆలియా భట్‌ను తీసుకున్నామని క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. అంటే సినిమాలో అలియా భట్ కనిపించేది కాసేపే అయినా కూడా చాలా కీలకమైన పాత్ర చేస్తుందని అర్థమైపోతుంది.

 

More Related Stories