English   

బన్నీ, సల్మాన్ అయిపోయారు నెక్స్ట్ ఎవరో ..

chiranjeevi
2020-05-06 15:25:31

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఎందుకో కానీ బాగా లేతయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా. సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయట కొచ్చాయి. 

తెలుగు వర్షన్‌లో చిరుకు హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. ఇప్పటికే తెలుగు వెర్షన్ స్క్రిప్ట్‌లో సుకుమార్‌తో పాటు కొంత మంది రైటర్స్ మార్పులు చేర్పులు చేశారు. ఆ మార్పులన్నీ కలిపి దీనిని పూర్తి స్థాయి తెలుగు సినిమాగా తీర్చి దిద్దే పనిలో పడ్డాడట సుజీత్. నిజానికి ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ లో మోహన్ లాల్ నటించారు. ఆ సినిమాలో ఆయన రోల్ నే ఇప్పుడు చిరు పోషిస్తున్నారు. ఇక మోహన్ లాల్ నమ్మిన బంటుగా ఉండే ఒక పాత్రను పృథ్వీరాజ్ పోషించారు. ఈ క్రమంలోనే తెలుగు వర్షన్‌లో పృథ్వీరాజ్ పోషించిన ఆ పాత్రను ముందుగా అల్లు అర్జున్ పోషిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. 

అందుకే ఇప్పుడు తాజాగా ఆ పాత్రను సల్మాన్ ఖాన్ చేత చేయించాలని చూస్తున్నారని ప్రచారం మొదలయింది చరణ్. నిజానికి చిరంజీవి రీ ఎంట్రీ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయాలని అనుకున్నారని ఆ సమయంలో అది కుదరకపోవడంతో లూసిఫెర్ తెలుగు రీమేక్ లో సల్మాన్‌ని భాగం చేయాలని చిరంజీవి  యోచిస్తున్నట్టు ఈ ప్రచారం సాగింది. అయితే ఇదంతా ప్రచారమే కానీ ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. ఇప్పటికే రెండు చిత్రాలతో బిజీగా ఉన్న సల్మాన్ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించే అవకాశాలు లేవని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి ఈ పాత్రను ఎవరు చేస్తారో చూడాలి.

More Related Stories