యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న నితిన్

ఈ మధ్య తెలుగు సినిమాలకి బాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తోంది. కొన్ని సినిమాలని రీమేక్ చేస్తుండగా మరికొన్నిటిని మాత్రం హిందీ డబ్బింగ్ చెప్పించి డిజిటల్ ఫ్లాట్ ఫాంలలో విడుదల చేస్తున్నారు. ఈ మధ్యన తాజాగా రామ్ నటించిన మూడు సినిమాలు యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ సాధించి అద్భుతమైన రికార్డు సొంతం చేసుకోగా ఇప్పుడు అదే బాటలో నితిన్ కూడా నడుస్తున్నారు. తాజాగా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ ఆదిత్య మూవీస్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన నితిన్ నటించిన సూపర్ హిట్ సినిమాలు అఆ, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం హిందీ డబ్ వెర్షన్ కు ఓవర్ ఆల్ గా 400 మిలియన్ల వ్యూస్ రాబట్టినట్టు తేలింది.
ఇందులో దాదాపు అఆ కు 182 మిలియన్ల వ్యూస్ గ, అఆ 2 (ఛల్ మోహన్ రంగ హిందీ వెర్షన్) కు 112 మిలియన్ల వ్యూస్, అలాగే ఇక్కడ డిజాస్టర్ గా నిలిచినా శ్రీనివాస కళ్యాణం కు 100 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. నితిన్ నటించిన ఈ మూడు సినిమాలుకి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ ఆదిత్య వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇక ఈ రేంజ్ లో హిందీ ఆడియెన్స్ తెలుగు సినిమాలను ఆదరిస్తే భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు ఇలా హిందీలో డబ్బింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలుగులో సరిగా ఆడని సినిమాలు కూడా డబ్బింగ్ అయ్యాక మిలియన్స్ వ్యూస్ సాధించడం. అంటే మనకు నచ్చని సినిమాలు కూడా హిందీ జనానికి నచ్చుతున్నాయన్న మాట.