ఏకంగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన చైతూ

మజిలీ సినిమాతో చానళ్ళ తరువాత సూపర్ హిట్ కొట్టిన నాగ చైతన్య వరుస్ సినిమాలు ఒప్పుకుంటూ మంచి ఊపు మీదున్నాడు. ఇప్పుడు ఆయన లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు. శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా దెబ్బ గట్టిగా ఉన్నా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా తమ షూట్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి ఆపక తప్పని పరిస్థితి. అయితే ఆ విషయం ఎలా ఉన్నా ఇప్పుడు నాగచైతన్య తదుపరి ప్రాజెక్ట్ ఇదే అంటూ నాలుగు సినిమాల మీద చర్చ జరుగుతోంది.
ఇప్పటికే మనోడు బంగార్రాజు అనే సినిమా చేస్తున్నాడు, నాగార్జున లీడ్ రోల్ లో నటించే ఈ సినిమాలో ఈయన కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పరశురామ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఇప్పుడు మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అది కూడా ఒక మంచి జోనర్ అని అంటున్నారు. ఇక నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నాడని టాక్. అయితే ఈ సినిమాకి ‘థాంక్యూ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం సాగుతోంది.
అయితే ఇది కాక మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కనుందని అంటున్నారు. ఇంద్రగంటి సినిమాని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించబోతున్నారని అంటున్నారు. అలా చైతూ మొత్తానికి నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడన్న మాట.