ఆచార్యలో మరో స్పెషల్ సాంగ్...అనసూయతో

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ నటిగా కూడా రాణిస్తోంది. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్స్ చేసే కామెడీ కంటే అనసూయ అందచందాల కోసమే చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తనదైన యాంకరింగ్‌తో గుర్తింపు పొందిన అనసూయ ఆ క్రేజ్‌తోనే వరుసగా సినిమా అవకాశాలను పట్టేస్తోంది. క్షణం, రంగస్థలం లాంటి సినిమాల్లో నటించిన అనసూయ నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. యాత్ర సినిమాలో చేసింది ఒకటి రెండు సీన్లలో అయినా తన నటనానుభవం చూపించింది అనసూయ. ఆ తర్వాత అనసూయకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు కూడా వార్తలు వినిపించాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించబోయే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నదని అన్నారు కానీ అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇక ఆచార్య సినిమాలో లాక్ డౌన్ కు ముందు హీరోయిన్ రెజీనా పై ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ జరిగింది. ఇప్పుడు “ఆచార్య ” మూవీలో మరో స్పెషల్ సాంగ్ ఉందని అంటున్నారు. ఇక ఆ రెండో సాంగ్ ని అనసూయ చేత చేయించనున్నారని అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ రంగస్థలం మూవీ లో రంగమ్మత్త గా అనసూయ నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఈ సంగ్ కూడా అనసూయ చరణ్ మధ్య ఉండనున్నట్టు చెబుతున్నారు.