English   

పవన్ కళ్యాణ్ వివాదంపై నోరు విప్పిన పూనమ్ కౌర్..

Poonam Kaur
2020-05-06 16:57:27

పూనమ్ కౌర్ పేరు వింటే ఎందుకో మరి తెలియకుండానే పవన్ కళ్యాణ్ పేరు కూడా వస్తుంది. అంతగా ఈ ఇద్దరికి సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. ఒక్క సినిమా కూడా పవన్ తో కలిసి నటించకపోయినా కూడా కేరాఫ్ పవన్ కళ్యాణ్ అనే ఇమేజ్ మాత్రం తెచ్చుకుంది పూనమ్. ఈమె 15 ఏళ్ల కింద శ్రీకాంత్ హీరోగా వచ్చిన మాయాజాలం సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. తేజ తెరకెక్కించిన ఒక విచిత్రం.. సాయి కిరణ్ అడివి వినాయకుడు లాంటి సినిమాల్లో నటించినా కూడా కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. ఆ తర్వాత స్టార్ హీరోలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దాంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని సోషల్ మీడియాలో బిజీ అయిపోయింది పూనమ్. 

అయితే పవన్ ను అప్పుడప్పుడూ టార్గెట్ చేస్తూ సంచలనాలు రేపింది పూనమ్. అప్పట్లో దిశ కేస్ అప్పుడు పవన్ చెప్పిన రెండు బెత్తం దెబ్బలు అంటూ ట్వీట్ చేసి సంచలనం రేపింది. ఇక ఇప్పుడు పవన్ తో తన వివాదంపై నోరు విప్పింది. అప్పట్లో పవన్‌ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సాలో ముందు తనను తీసుకోవాలని అనుకున్న తర్వాత హీరోయిన్ ను మార్చారని వచ్చిన వార్తలు అబద్ధమని తేల్చేసింది. అలాంటిదేం లేదని చెప్పింది. ఎన్నికల సమయంలో తన గురించి చాలా పుకార్లు వినిపించాయని.. జల్సా చిత్రంలో అవకాశం దక్కలేదనే కారణంతో తను ఆవేదనకు గురైనట్టు ప్రచారం చేసారని చెప్పింది. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టి పారేసింది. ఒక్క దాసరి గారి దర్శకత్వంలో తప్ప మరే దర్శకుడితోనూ తాను పని చేయాలని కలలు కనేదని పూనమ్ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More Related Stories