English   

కోరనా వ్యాక్సిన్‌పై విజయ్ సేతుపతి సంచలన వ్యాఖ్యలు..

Vijay Sethupathi
2020-05-06 17:06:48

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తుంది. ఎప్పుడు ఎవర్ని కబలిస్తుందో తెలియట్లేదు. అయితే కరోనాతో పాటే మరో వ్యాధి కూడా చాలా మందిని పీడిస్తుంది. అయితే ఉన్నోళ్లకు ఆ వ్యాధి గురించి తెలియదు.. దాని పేరు ఆకలి.. ఆకలి కూడా నిజంగానే వ్యాధి. తినడానికి తిండి లేక.. చేసుకోడానికి పనుల్లేక లాక్ డౌన్ లో నరకయాతన పడుతున్నారు చాలా మంది. అందులో కొందరు కరోనాతో చావడం కాదు.. ఆకలితో చచ్చిపోతున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంత సాయం చేస్తున్నా కూడా ఇంకా అలాగే ఉంది పరిస్థితి. దీనిపై ఇప్పుడు విజయ్ సేతుపతి కామెంట్ చేసాడు. 

మన దేశంలో ఆకలి అనే వ్యాధి ఉందని.. ముందు దానికి వ్యాక్సిన్ కనుక్కుంటే బాగుంటుందని తెలిపాడు ఈయన. ప్రభుత్వాలపై సునిశిత విమర్శలు చేసే విజయ్ సేతుపతి.. కరోనా కట్టడి గురించి మాట్లాడుతూ.. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు దేవుడు దిగిరాడని చెప్పాడు. మనకి మనమే కలిసికట్టుగా ఉండి దీన్ని పారద్రోలాలని చెప్పాడు విజయ్. అందుకే ముందు ఆకలికి కూడా వ్యాక్సిన్ కనుక్కోవాలని సూచించాడు విజయ్ సేతుపతి. 

More Related Stories