English   

తగ్గనంటున్న సూర్య.. తగ్గిస్తామంటున్న థియేటర్స్ యాజమాన్యం..

suriya
2020-05-07 06:45:30

తమిళ ఇండస్ట్రీలో హీరో సూర్య, థియేటర్స్ యాజమాన్యం మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. ఈయన తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన పొన్‌మగల్‌ వందాల్‌ చిత్రాన్ని నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. మరో వారం రోజుల్లోనే ఈ చిత్రం రానుంది. థియేటర్స్ ఎలాగూ ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు.. తెరిచినా ప్రేక్షకులు వచ్చేలా కనిపించడం లేదు.. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు సూర్య. అయితే జ్యోతిక లాంటి స్టార్ నటించిన సినిమాను అలా ఓటిటిలో విడుదల చేయడం సరికాదని.. సూర్య నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు థియేటర్ల యాజమాన్యం. అలా చేస్తే తాము సూర్యకు రెడ్‌ కార్డ్‌ ఇస్తామని చెబుతున్నారు. అంటే ఇకపై సూర్య నిర్మించే ఎలాంటి చిత్రాలను తమ థియేటర్‌లలో విడుదల చేయబోమని అర్థం.

అలాగే కేరళ సినీ థియేటర్ల సంఘం కూడా సూర్య నిర్మించే, నటించే చిత్రాలను విడుదల చేయబోమని తెలియజేసింది. అయితే వాళ్లంతగా వార్నింగ్ ఇస్తున్నా కూడా సూర్య మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తాను నిర్మించిన సినిమాను ఓటిటిలో విడుదల చేయడానికే ఆయన సిద్ధమవుతున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈయన నటించిన సూరారై పోట్రు సినిమా విడుదలకు ఉండగా.. ఇప్పుడు ఇలాంటి సమయంలో సూర్య మొండిగా ముందుకు వెళ్తుండటం అందరికీ షాక్. ఈ విషయంలో ఎవరు తగ్గుతారో చూడాలిక.

 

More Related Stories