English   

ఓటిటిలో విడుదల కానున్న సందీప్ కిషన్ సినిమా..

sundeep
2020-05-07 07:04:23

చిన్న సినిమాలకు ఇప్పుడు ఇంతకంటే మంచి దారి మరోటి కనిపించడం లేదు. థియేటర్స్ కోసం చూసుకుంటే ఉన్నది ఉంచుకున్నది రెండూ పోతాయని వాళ్లు భయపడుతున్నారు. దాంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాలను ఓటిటిలో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే సందీప్ కిషన్ లాంటి హీరో నటించిన సినిమాను కూడా ఇప్పుడు ఓటిటి విడుదల చేయాలని చూస్తున్నారు. దాంతో డిస్ట్రిబ్యూటర్లను నిజంగానే షాక్ అవుతున్నారు. ఆయనకు మార్కెట్ ఉంది.. అలాంటప్పుడు ఎందుకు అలా చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే సందీప్ కిషన్ నటించిన ఓ సినిమా ఏడేళ్లుగా బాక్సుల్లోనే ఉండిపోయింది.. విడుదల కాలేదు. దాంతో ఆ సినిమాను ఇప్పుడు ఓటిటిలో విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. కరోనా వైరస్ దెబ్బ స్పష్టంగా మరో మూడు నాలుగు నెలల వరకు దేశంలో ఉండటం ఖాయం. అందుకే ఇప్పట్లో సినిమాలు విడుదల చేయడం అనే మాట మర్చిపోవాలి నిర్మాతలు. అందుకే ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి కొన్ని సినిమాలు.

ముఖ్యంగా చిన్న సినిమాలకు దీనికి మించిన ప్లాట్ ఫామ్ మరొకటి దొరకడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పోటీలో థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత దొరకడం కూడా కష్టమే. ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. వాటన్నింటినీ కాదని చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం ఎగ్జిబిటర్ లకు తలకు మించిన భారమే.. అయినా అది జరగని పని. ఒకవేళ జరిగినా థియేటర్లకు ప్రేక్షకులు ఆ సినిమాను చూడటానికి వస్తారు అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. అందుకే మరో ఆలోచన లేకుండా చాలా మంది చిన్న నిర్మాతలు తమ సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ పద్ధతిలో విడుదలైన అమృతరామమ్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా మరీ స్లోగా ఉంది అంటూ తీసి పారేశారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే సందీప్ కిషన్ డికే బోస్ సినిమాను కూడా ఓటిటిలో విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. 2013లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు.

 

More Related Stories