ప్రభాస్ కి విలన్ గా అరవింద్ స్వామి

ప్రస్తుతం జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ సినిమా తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్నారు. సై ఫై కధతో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. దాదాపు 400కోట్లతో పాన్ వరల్డ్ మూవీగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్కరు స్టార్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఒకప్పటి స్టార్ హీరోను నటింపచేయాలని చూస్తున్నట్టు చెబుతున్నారు.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అదీ కాక సరికొత్త విలనిజం పండించడానికి నాగ్ అశ్విన్ ప్లాన్ చేశారని అంటున్నారు. ఆ పాత్రకు అరవింద్ స్వామి అయితే బావుంటుందనే ఆలోచనలో ఉందట సినిమా యూనిట్. ప్రస్తుతం ఆయనతో సినిమా చేసే విషయం చర్చల దశలో ఉందని, త్వరలోనే స్పష్టత రావొచ్చని అంటున్నారు. రామ్ చరణ్ నటించిన ధృవ సినిమాలో విలన్ గా నటించి ప్రశంశలు అందుకున్నాడు అరవింద్ అలా ఒకప్పుడు హీరోగా ఎన్నో హృదయాలు దోచుకున్న ఆయన స్టైలిష్ విలన్ల జాబితాలో చేరారు. ఆయన ప్రభాస్ తో ఎలా తలపడతాడో అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. ‘ఓ డియర్’, ‘రాధే శ్యాం’ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా పూర్తయ్యాక నాగ్ అశ్విన్- ప్రభాస్‌ల ప్రాజెక్టు ప్రారంభమవుతుందని అంటున్నారు.