English   

టబు పాత్రలో భూమిక 

 bhoomika
2020-05-07 11:42:10

కుర్ర హీరో నితిన్‌ ప్రస్తుతం వరుస చిత్రాలని అనౌన్స్ చేసి మంచి ఫాంలో ఉన్నాడు. తాజాగా భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో భీష్మతో పాటే వెంకీ అట్లూరి, చంద్రశేఖర్‌ యేలేటి, కృష్ణ చైతన్యలతో సినిమాలు కూడా ఓకే చేశాడు. ఇక తాజాగా ఆయన మేర్లపాక గాంధీతో ‘అంధాదున్‌’ రీమేక్‌ కూడా పట్టాలెక్కించాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. నిజానికి ఈ సినిమాలో విలన్‌ ఓ లేడీ. హిందీ మాతృకలో ఈ పాత్రను టబు అద్భుతంగా నటించింది. తెలుగు రీమేక్‌లోనూ ఆ పాత్రను ఆమెతోనే చేయించాలని నితిన్ సినిమా యూనిట్ కూడా ప్రయత్నించగా ఈ పాత్ర చేయడానికి టబు కూడా అంగీకరించిందని కానీ, ఆమె అడిగిన రెమ్యునరేషన్ విన్నాకనే యూనిట్ షాకయిందని ప్రచారం జరిగింది. అయితే ఆమెను కాదని ఇలాంటి పాత్రను తెలుగులో ఎవరు చేస్తారా? అనే ప్రశ్న ఎదురయ్యింది. తాజాగా భూమిక పేరు ఈ పాత్రకు పరిశీలిస్తున్నారని అంటున్నారు. నిజానికి టబు ప్లేస్ లో రమ్యకృష్ణ ఎంపికైందని గతంలో వార్తలొచ్చాయి. అవేవీ యూనిట్ వారు ద్రువీకరించక పోవడంతో ఇప్పుడు భూమిక పేరు తెర మీదకు వచ్చింది.

More Related Stories