English   

ఆ సినిమా ఆగలేదట...క్లారిటీ ఇచ్చిన చందూ మొండేటి

sharwanand
2020-05-07 11:54:17

వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోడానికి ట్రై చేస్తున్నాడు యువ దర్శకుడు చందు మొండేటి. అయితే కార్తికేయ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చందూకి ఆ సినిమా ఒక్కటే మిగిలింది బాగా ఆడిందని చెప్పుకోడానికి, ఆ తర్వాత చేసిన ప్రేమమ్ తాజాగా చేసిన సవ్యసాచి కూడా నిరాశే మిగిల్చింది. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు తనకు కలిసి వచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. అయితే ఈయన శర్వాతో ఒక సినిమా చేస్తున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి, కానీ ఆ సినిమా అసలు ప్రకటనే లేకుండా పోయింది. 

అయితే ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చందూ ప్రకటించాడు. కార్తికేయ 2 కంటే అదే ముందు తీయాల్సిన సినిమా అని ఆయన చెప్పుకొచ్చారు. మనం సినిమాలో లానే 1910 నుంచి 2021 వరకు జరిగే ప్రేమకథ అని ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని ఆయన చెప్పుకొచ్చాడు. షూటింగ్ కి వెళదాం అనుకునే లోపే శర్వానంద్‌ జాను కోసం బ్యాంకాక్ వెళ్లి గాయపడ్డారని అయితే శారీరకంగా శ్రమించి చేయాల్సిన పాత్ర కావడంతో అది వాద్యిఆ పడిందని చెప్పుకొచ్చారు.  శర్వానంద్‌ తో సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక శర్వా సినిమా తర్వాత గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చాడు.  
 

More Related Stories