English   

షూట్ లో పాల్గొన్న అమితాబ్...సోషల్ మీడియాలో రచ్చ

Amitabh Bachchan
2020-05-07 12:19:14

కరోనా ఏర్పరిచిన కల్లోలం అంతా ఇంత కాదు. ఈ దెబ్బకు జనజీవనం అంతా స్థంబించి పోయింది. ఇక సినిమాల విషయానికి వస్తే లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. సినీ ప‌రిశ్రమ‌కి సంబంధించిన దాదాపు అందరూ తమ తమ ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు. కాని బాలీవుడ్ స్టార్ అమితాబ్ మాత్రం షూటింగ్ లో పాల్గొన్నారనే వార్త పెద్ద సంచలనంగా మారింది. అయితే ఆయన పాల్గొన్నది సినిమా షూటింగ్ లో కాదు. ఆయన ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ అనే ఒక రియాలిటీ షో చేస్తున్నారు. ఆ షో మరో రెండ్రోజుల్లో రిజిస్త్రేషన్స్ మొదలవబోతోంది. ఇప్పుడు ఆ షో ప్రోమో కోసం షూటింగ్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ విష‌యం బ‌య‌టకి రావ‌డంతో ప్రతి ఒక్కరు ఈ విషయం మీద రకరకాలుగా స్పందిస్తున్నారు. 

అయితే ఈ విషయం జనాల్లోకి తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉండడంతో అమితాబ్ స్పందించారు. అన్ని జాగ్రత్తలు తీసుకొనే షూటింగ్‌లో పాల్గొన్నామన్న ఆయన. రెండు రోజుల‌లో చేయ‌వ‌ల‌సింది ఒక్క రోజులోనే షూట్ పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇక అందుతున్న సమాచారం మేరకు ఒకే రోజు జ‌రిగిన ఈ షూటింగ్‌లో అమితాబ్ మీద దాదాపు 12 వీడియోలు షూట్ చేశారట. కేబీసీ 12 ప్రోమోతో పాటు కరోనా చికిత్స కోసం పోరాడుతున్న డాక్టర్లు, నర్సులను ప్రోత్సహించే వీడియోల‌లో కూడా ఆయన కనిపించనున్నారని స‌మాచారం. మే 9 న రాత్రి 9గం.ల నుండి ఈ కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ మొదలవుతుంది. ఇక ఈ షో ప్రోమో షూట్ కే ఇంత రచ్చ జరిగితే అసలు షోని ఎలా నిర్వ‌హించాల‌నే దానిపై ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు ఆలోచ‌న‌లు చేస్తున్నారని అంటున్నారు.  

More Related Stories