చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్.. మెగాస్టార్ రియాక్షన్..

చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో కొరటాల శివ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేయనున్నాడు కొరటాల శివ. ఇక ఈ సినిమా తర్వాత లూసిఫర్ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నాడు మెగాస్టార్. దీని కోసం సాహో దర్శకుడు సుజిత్ ఇప్పటికే కథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఈ సినిమాలో అతిథి పాత్రలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడన్న ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. మెగా ఫ్యామిలీతో సల్మాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో అంతా నిజమే అనుకున్నారు. పైగా రామ్ చరణ్ కి మంచి స్నేహితుడు కూడా. అందుకే అంతా ఈజీగా నమ్మేసారు.
అయితే తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. లూసిఫర్ రీమేక్ కు సంబంధించి కథలో మార్పులు జరుగుతున్నాయని చెప్పిన చిరు.. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక ఇంకా జరగలేదని చెప్పాడు. మెగా ఫ్యామిలీ హీరోలు నటిస్తున్నారని.. బాలీవుడ్ హీరో సల్మాన్ నటిస్తున్నడని వస్తున్న వార్తలు అన్నీ అబద్దాలే తేల్చేశాడు చిరంజీవి. కథ మొత్తం పూర్తయిన తర్వాత ఇందులో ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ ఇస్తామని మెగాస్టార్ తెలిపాడు.