English   

పవన్ కళ్యాణ్ ను భారీ దెబ్బ కొట్టిన కరోనా వైరస్..

 pawan kalyan
2020-05-07 17:27:09

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే జరుగుతుంది. చాలా రోజుల తరువాత రాజకీయాల మంచి బ్రేక్ తీసుకొని సినిమాల వైపు వచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే ఈయన అనుకున్నదొకటి ప్రస్తుతం జరుగుతున్నది మరొకటి. వరుసగా సినిమాలు పూర్తి చేసి వచ్చే ఎన్నికలకు డబ్బులు కూడపెట్టుకోవాలని రీ ఎంట్రీ ఇచ్చాడు  పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే వకీల్ సాబ్ సినిమా చాలా వేగంగా పూర్తి చేశాడు పవన్. కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు క్రిష్ సినిమా కూడా చాలా వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు పవన్.. అన్ని బాగుండుంటే ఈ పాటికి వకీల్ సాబ్ విడుదలకు సిద్ధమయ్యేది. క్రిష్ సినిమా సగానికిపైగా పూర్తయి ఉండేది. కానీ మధ్యలో లాక్ డౌన్ నుంచి అన్ని పాడు చేసింది. పవన్ కళ్యాణ్ ప్రణాళికలపై నీళ్లు జరిగింది కరోనా వైరస్. 

ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ఎలా కట్ చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ముందుగా అనుకున్నదాని ప్రకారం అయితే ఈ ఏడాది వకీల్ సాబ్.. వచ్చే ఏడాది సమ్మర్లో క్రిష్ సినిమా.. చివర్లో హరీష్ శంకర్ సినిమా విడుదల చేయాలనుకున్నారు పవన్. కానీ ఇప్పుడు అన్ని ప్లాన్స్ పాడైపోయాయి. అసలు ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితి లో పడిపోయాడు పవన్ కళ్యాణ్. మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు.. అయినా కూడా ఎంత వేగంగా పూర్తవుతాయని క్లారిటీ లేదు. దాంతో ఆయన ప్లానింగ్స్ అని ఒక్కసారిగా మారిపోయాయి. మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. 
 

More Related Stories