English   

అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెడుతున్న లాక్‌డౌన్..

 Allu Arjun
2020-05-07 18:10:50

అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ తో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. దీనిపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత సినిమాపై ఆసక్తి కూడా పెరిగిపోయింది. మరోసారి రంగస్థలం తరహాలోనే పాత కాలం కథనే తీసుకున్నాడు సుకుమార్. దానికితోడు రివేంజ్ డ్రామాతోనే వస్తున్నాడు లెక్కల మాస్టారు. ఈ సినిమాలో బన్నీ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా ఆగిపోయింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాతే షూటింగ్ మళ్లీ తిరిగి ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ మ్యూజిక్ స్వరాలందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌కు లాక్ డౌన్ తో చెప్పుకోలేని కష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాకు కావాల్సిన దానికంటే కూడా ఎక్కువగా గడ్డం, జుట్టు పెరిగిపోతుండటం.. బరువు పెరుగుతుండటంతో తిప్పలు పడుతున్నాడు బన్నీ. దాంతో ఉన్నఫలంగా మళ్లీ కరెక్ట్ లుక్ లోకి రావడానికి చాలా కష్టపడుతున్నాడు అల్లు అర్జున్. ఇందులో పుష్పక్ నారాయణ్ అనే లారీ డ్రైవర్ పాత్ర చేస్తున్నాడు బన్నీ. గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసే పాత్ర ఇది. చిత్తూరు కుర్రాడి పాత్ర కావడంతో ఈ యాస కూడా నేర్చుకుంటున్నాడు. ఏదేమైనా కూడా మళ్లీ షూటింగ్ మొదలయ్యే సమాయానికి లుక్ లో మార్పు రాకుండా చూసుకుంటున్నాడు అల్లు వారబ్బాయి. 

More Related Stories