కృష్ణ బర్త్ డేకి మహేష్ ఇచ్చే ట్రీట్ అదేనా

ఈ యేడాది మొదట్లోనే సంక్రాంతికి మహేష్ బాబు-అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత సినిమాగా మహేష్ పరుశురామ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ముందు వంశీ పైడిపల్లి తో సినిమా ఉంటుందని అనుకున్నా కారణాలు ఏవయినా కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టారు. నిజానికి పరశురామ్ తో సినిమా ఇప్పటికే లాంచ్ కావాల్సి ఉన్నా అది కుదరలేదు. ఇక ఈ సినిమా కరోనా ఎద్దడి తగ్గాక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంచించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కరోనా ఇప్పట్లో తగ్గేలా అయితే కనిపించడం లేదు. కానీ ప్రతి ఏడాది కృష్ణ బర్త్‌డే సందర్భంగా వదులుతున్నట్టుగా స్టిల్.. లేదంటే టీజర్ రిలీజ్ చేయడానికి మహేష్ నటిస్తున్న సినిమా ఒక్కటీ సెట్స్‌పై లేదు.
అందుకే ఈ సారి కూడా లేదనకుండా పరశురామ్ మూవీని ఆరోజు ఎనౌన్స్ చేసి తన ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి మహేష్ రెడీ అయ్యాడని అంటున్నారు. అలాగే ఈ ఒక్క సినిమానే కాక మరో ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేసే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి మహేశ్ ను డైరెక్ట్ చేస్తున్నట్టు... లైవ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే ఈ సినిమా మొదలుకావడానికి రెండేళ్లు పడుతుంది. మరి ఈ లోగా మరో రెండు సినిమాలు చేయాలన్న ప్లాన్ లో మహేశ్ వున్నాడట. మరి చూద్దాం కృష్ణ బర్త్‌డే మహేష్ ఫ్యాన్స్‌కు ఎలాంటి ట్రీట్ తీసుకొస్తుందో.