English   

పీరియాడిక్ సినిమాల మీద పడిన టాలీవుడ్

tollywood
2020-05-07 20:34:50

తెలుగు సినిమా తన జానర్ మార్చుకుంటోంది. ఇప్పటిదాకా ఎక్కువగా లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు తీసి తీసి అలసిన మన మేకర్స్ ఇప్పుడు రాజుల కాలంలోకి వెళ్తున్నారు. భారీ ఖర్చుతో పీరియాడికల్ డ్రామాలు తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. మాస్ కి కేరాఫ్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్‌ ఇపుడు ఫస్ట్ టైమ్‌ పీరియాడికల్‌ మూవీ చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో బ్రిటీష్ కాలంనాటి కథలో నటిస్తున్నాడు పవన్. ఎక్కువగా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేసే క్రిష్‌, పవన్‌ కళ్యాణ్‌ తో రాబిన్‌హుడ్‌ తరహా సినిమా తీస్తున్నాడు. స్వాతంత్ర్యానికి పూర్వంనాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి నిర్మాతగా ఏఎం రత్నం వ్యవహరిస్తున్నారు. ఇక జానపద 'బాహుబలి'తో ఇండియన్‌ ఆడియన్స్‌ని మాహిష్మతి సామ్రాజ్యంలోకి తీసుకెళ్లిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ తో మన్యం వీరులని చూపించబోతున్నాడు.

ఇదీ పీరియాడిక్ డ్రామానే. 'ట్రిపుల్‌ ఆర్'లో రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తోంటే, తారక్‌ కొమరం భీమ్‌గా కనిపిస్తున్నాడు. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, లవ్ స్టోరీస్ లో మెరుస్తున్న నాని కూడా ఫస్ట్‌ టైమ్‌ పీరియాడికల్‌ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. రాహుల్‌ సంక్రిత్యాన్ దర్శకత్వంలో శ్యామ్‌ సింగారాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక రానా కూడా ఒకటి కాదు ఏకంగా రెండు పీరియాడికల్‌ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి విరాటపర్వం కాగా మరొకరి 1945. ఇది కాక శర్వా కూడా చండూ మొండేటి దర్శకత్వంలో ఒక పీరియాడిక్ సినిమా చేస్తున్నారు.

More Related Stories