English   

ఐకాన్ సినిమాని లేట్ చేసింది బన్నీనే నట...రీజన్ ఏంటంటే ?

Alu Arjun
2020-05-08 06:51:22

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'.. పూజా హేగ్దే కథానాయకగా నటించిన ఈ సినిమా మొన్న సంక్రాంతికి రిలీజయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. చాలా చోట్ల నాన్ బాహుబలు రికార్డులు అన్నీ ఈ సినిమా తన పేరున రాసేసుకుంది. గీతా ఆర్ట్స్, హరిక హాసిని క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మించి జాయింట్ గా జాక్ పాట్ కొట్టారు. అయితే ఈ సినిమా తర్వాత బన్ని సుకుమార్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది కూడా. బన్నీ షూట్ లో జాయిన్ కావడం కోసమే చిత్తూరు యాస నేర్చుకుంటున్నాడు. అయితే నిజానికి ఈ రెండు సినిమాల కంటే ముందే బన్ని 'ఐకాన్' సినిమా ప్రకటించాడు. వేణు శ్రీరామ్ దీనికి దర్శకుడుగా దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాని గట్టిగానే ఎస్టాబ్లిష్ చేశారు.

అయితే ఈ సినిమాని ఆగిపోయిందని కొద్దిరోజులు క్రితం ప్రచారం జరిగింది. దానికి తోడు వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమాకి షిఫ్ట్ కావడంతో సినిమా ఆగిపోయిందని అందరు అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఐకాన్ విషయంలో అల్లు అర్జున్ కావాలనే గ్యాప్ తీసుకున్నట్టు చెబుతోంది ఆ సినిమా యూనిట్. ఎందుకంటే ఇది ఒక ప్రయోగాత్మక సినిమా అట. ఇలాంటి సినిమాలు చేయాలంటే కొంచం ఎక్కువ టైం పడుతుందని భావించి అల్లు అర్జున్ కావాలనే ఈ సినిమాని అపినట్టు చెబుతున్నారు. ముందు సుకుమార్ సినిమా చేసేస్తే సగం టెన్షన్ తీరిపోతుందని ఒక హిట్ ఖాతాలో వేసుకున్నాక ప్రయోగాత్మక సినిమా చేసి ఒక వేళ అది తేడా పడినా రెండు హిట్స్ తరువాత ఒక ఫ్లాప్ పడినా ఇబ్బంది లేదని  భావించి సుకుమార్ సినిమా ముందు చేస్తున్నాడని అంటున్నారు. 

More Related Stories