English   

చిరంజీవికి కధ చెప్పిన శంకర్ ?

chiru
2020-05-08 07:38:51

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఎందుకో కానీ బాగా లేతయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా. సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయట కొచ్చాయి.

తెలుగు వర్షన్‌లో చిరుకు హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. ఇప్పటికే తెలుగు వెర్షన్ స్క్రిప్ట్‌లో సుకుమార్‌తో పాటు కొంత మంది రైటర్స్ మార్పులు చేర్పులు చేశారు. ఆ మార్పులన్నీ కలిపి దీనిని పూర్తి స్థాయి తెలుగు సినిమాగా తీర్చి దిద్దే పనిలో పడ్డాడట సుజీత్. అయితే తాజాగా చిరంజీవి విషయంలో ఒక ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే చిరంజీవి డైరెక్టర్ శంకర్‌ తో ఓ సినిమా చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారట. శంకర్‌ తో కలిసి పని చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారని, ఇటీవలే ఈ ఇద్దరి మధ్య కధా చర్చలు కూడా జరిగాయని టాలీవుడ్‌ లో టాక్ వినిపిస్తోంది. చిరుకి శంకర్‌ ఓ సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ స్టోరీ చెప్పారట. దీంతో ఈ కధ బాగా నచ్చిన క్రమంలో వీరిద్దరూ ఒక సినిమా చేయచ్చని అంటున్నారు. ప్రస్తుహానికి కమల్‌ హాసన్‌ హీరోగా చేస్తోన్న ‘భారతీయుడు 2’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు శంకర్‌

More Related Stories