English   

వారిని స్టడీ చేస్తున్న బాలయ్య...సినిమా కోసం హోంవర్క్

 Balakrishna
2020-05-08 09:58:27

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నిజానికి అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరిలోనే సెట్స్‌ పైకి వెళ్ళాల్సి ఉంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి జరగనుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏమయిందో ఏమో కానీ ఈ సినిమా షూటింగ్ లేట్ గా మార్చ్ నెల మొదట్లో మొదలయింది. ఆ మొదటి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోండగా కరోనా కాటు వేసింది. అయితే ఈ సినిమా కధ ప్రకారం వారణాసిలో కూడా షూట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని ఒక పాత్ర అఘోరా పాత్ర అని మరో పాత్ర నార్మల్ పాత్ర అని స్వయంగా బోయపాటే ఈ మధ్యన ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు. 

అయితే ఈ సినిమాలో ఆయనకు సోదరుడిగా నటించేందుకు సందీప్‌ మాధవ్‌ (సాండీ)ని తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఇప్పుడు బాలయ్యకు సంబందించిన ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది. అదేంటంటే అఘోరా పాత్రలో ఈజ్ తో నటించేందుకు అఘోరాలకి సంబందించిన అన్ని విషయాల మీద బాలకృష్ణ స్టడీ చేస్తున్నారని అంటున్నారు. నిజమైన అఘోరాల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మనుషులతో వారి ప్రవర్తన ఎలా ఉంటుందనే అనేక విషయాలు వీడియోలు, పుస్తకాలు, అలాగే హిమాలయ యాత్రలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా తెలుసుకుంటున్నాడని అంటున్నారు. చూడాలి ఈ సినిమాతో అయినా బాలయ్య హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లో పడతారేమో !

More Related Stories