English   

రష్మిక డ్రీమ్ ని చెడ కొట్టిన కరోనా

Rashmika Mandanna
2020-05-08 10:55:35

కన్నడ బ్యూటీ రష్మిక డ్రీమ్‌కు కరోనా బ్రేకులేసిందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ కన్నడ కస్తూరి ఫ్యూచర్‌ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఓ కల మాత్రం 2020లో తీర్చేసుకోవాలని అనుకుంది. దీనికి తగ్గట్టే సరిలేరునీకెవ్వరు సక్సెస్‌తో పరిస్థితులు కలిసొచ్చాయి. ఇంతలో మహమ్మారిలా దూసుకొచ్చిన కరోనా రష్మిక టార్గెట్‌పై నీళ్లు చల్లింది. ఇంతకీ రష్మిక డ్రీమ్‌ ఏంటంటే రెండు కోట్ల రెమ్యునరేషన్ అంట. సరిలేరు నీకెవ్వరు హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్న రష్మిక రెండు భారీ సినిమాలకు సంతకాలు చేసింది. అందులో ఒకటి అల్లు అర్జున్- సుకుమా ర్ క్రేజీ ప్రాజెక్టు పుష్ప కాగా మరోకట్టి తమిళంలో కార్తీ సరసన మరో సినిమా.

అయితే ఈ రెండు ప్రాజెక్టుల కోసం ఈ అమ్మడు నిర్మాతల నుంచి రెండు కోట్ల పారితోషికం అందుకోవాలని ముందు భావించిందట. అయితే అంత కాదు కదా ఇప్పుడు కోటిన్నర కూడా ఇప్పుడున్న పరిస్థితిలో వర్క్ వుట్ అవుతుందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇండస్ట్రీలన్నీ అల్లకల్లోలంగా ఉన్న క్రమంలో ఆమెకు అంత రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేమని చెప్పేశారట మేకర్స్. రష్మిక రెమ్యునరేషన్‌కు బ్రేకులేసిన కరోనా పరిస్థితుల తారుమారు చేసిందని అంటున్నారు.  

More Related Stories