English   

ఎప్పుడూ అదే పనా కృతి కర్భాందా.. అస్సలు బోర్ కొట్టదా..

 Kriti Kharbanda
2020-05-08 11:14:31

శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు విలన్స్ ను చూసి అడుగుతాడు కదా.. ఎప్పుడూ ఇదే పనారా బోర్ కొట్టదా అని...? ఇప్పుడు కృతి కర్బందాను చూస్తుంటే కూడా ఇదే ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఈమెకు కూడా ఎప్పుడూ ఒకే పని. అదే అందాలు ఆరబోయడం.. ప్రతీ మూడు నాలుగు రోజులకు ఒకసారి హాట్ ఫోటోషూట్ చేసి ఔరా అనిపిస్తుంది ఈ భామ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తెలుగులో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లాంటి హీరోలతో నటించినా కూడా ఈమె జాతకం మాత్రం మారలేదు. ప‌దేళ్లుగా తెలుగులో ట్రై చేసినా కూడా సరైన గుర్తింపు రాలేదు. కన్నడలో స్టార్ అయినా కూడా తెలుగులో మాత్రం అస్సలు ఈ బ్యూటీని పట్టించుకోలేదు మన దర్శక నిర్మాతలు. అందాల ఆర‌బోత‌కు సిద్ధంగా ఉన్నా.. అక్క‌ పాత్ర‌ల‌కు సెటిలైపోయినా కృతికి అదృష్టం మాత్రం క‌లిసి రావ‌డం లేదు. చివ‌రికి ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్ కూడా ఏం చేయలేకపోయేసరికి ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ. 

గ్లామ‌ర్ షో లో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు కృతిక‌ర్బందా. ఇప్ప‌టికీ హీరోయిన్ గా వెలిగిపోదామ‌నే ప్ర‌య‌త్నాలు  చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. అయితే విచిత్రంగా టాలీవుడ్ పొమ్మన్నా.. బాలీవుడ్ మాత్రం రారమ్మని ఆహ్వానం పలుకుతుంది. అక్కడ వరస సినిమాలతో రప్ఫాడిస్తుంది ఈ భామ. 2019లో హౌజ్ ఫుల్ 4, పాగల్ పంటి లాంటి సినిమాలు చేసింది కృతి. ఇప్ప‌టికీ అక్క‌డ అవ‌కాశాల కోసం చూస్తూనే ఉంది కృతి. ఇప్పుడు కూడా ఎక్క‌డ ఏ ఈవెంట్ జ‌రిగినా ఉల్లిపొర కంటే ప‌లుచ‌గా ఉండే దుస్తుల్లో క‌నిపిస్తుంది. ఇక మ‌ధ్య‌లో ఫోటోషూట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. మరి అక్కడ ఇంకెంతకాలం కెరీర్ నడిపిస్తుందో చూడాలిక. ఇంత చేసినా కూడా సౌత్ మాత్రం కృతి వైపు అస్సలు చూడటం లేదు.

More Related Stories