English   

సీరియల్స్ షూటింగ్స్‌కు పర్మిషన్.. కానీ కండీషన్స్ అప్లై..

Kannada Serials
2020-05-08 11:58:51

లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. అందులో సీరియల్స్ కూడా ఉన్నాయి. డైలీ సీరియల్స్ షూటింగ్ అప్పటికప్పుడు చేస్తుంటారు. అలాంటివన్నీ ఇప్పుడు ఆగిపోవడంతో భారీగా నష్టపోతున్నారు టీవీ సీరియల్స్ యాజమాన్యం. అందుకే తమకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరగా.. కర్ణాటక ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ క్రమంలోనే తమకు షూటింగ్ చేసుకోడానికి అనుమతి ఇవ్వడంతో పాటు షరుతులు కూడా పెట్టారు. కన్నడ టీవీ షోస్, సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతి ఇచ్చింది. కానీ కండీషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా పెట్టింది. ఈ నిబంధనలు పాటించకపోతే షూటింగ్స్ ఆపేయాల్సిందే అంటున్నారు వాళ్లు.

1) సెట్‌లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి.. శానిటైజర్స్ ఉపయోగించాలి.
2) ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం భోజనాలకు బఫెట్ సిస్టమ్ ఫాలో కావాలి.. పని వాళ్లతో భోజనాలు సర్వ్ చేయించుకోకూడదు.
3) షూటింగుకు అవసరమైన.. తప్పనిసరిగా కావాల్సిన సాంకేతిక నిపుణులు నటీనటులు మాత్రమే సెట్‌లో కనిపించాలి.. మిగిలిన వాళ్లకు నో ఎంట్రీ..
4) సెట్‌లో వయోవృద్ధులకు అనుమతి లేదు.. సీనియర్ నటులకు అక్కడ నో ఎంట్రీ బోర్డ్ ఉంటుందన్నమాట..
5) ఇండోర్ షూటింగ్స్ మాత్రమే చేసుకోవాలి.. అవుట్ డోర్ వెళ్ళకూడదు.
6) అన్నింటికంటే ముఖ్యమైనది.. సెట్‌లో అందరూ కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.. అవసరమైతే కానీ పక్క వాళ్ళతో మాట్లాడకూడదు.
7) ఇవన్నీ ఫాలో అయితే కానీ షూటింగ్స్ చేసుకోకూడదని ప్రభుత్వం సీరియస్‌గా చెప్పింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు సీరియల్ దర్శక నిర్మాతలు. అదే విధంగా తెలుగులోనూ అనుమతి ఇవ్వవలసినదిగా టీవీ ప్రతినిధులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కలిసారు. అయితే జూన్ వరకు ఓపిక పట్టాలంటూ మంత్రి చెప్పాడు. 

More Related Stories