English   

లాక్‌డౌన్‌లో పొలం పనులు చేస్తున్న హీరోయిన్..

 Keerthi Pandian
2020-05-08 14:06:21

లాక్‌డౌన్ పుణ్యమా అని అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. దాంతో విచిత్రమైన ఛాలెంజులు అన్నీ చేస్తున్నారు. వంటలు చేస్తున్నారు.. కండలు పెంచుతున్నారు.. అలా కొందరు పనికిమాలిన ఛాలెంజులు చేస్తున్నారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే కొందరు మాత్రం అద్భుతమైన పనులు చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఓ హీరోయిన్ మాత్రం పొలం పనులు చేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తుంది. ఆమె పేరు కీర్తీ పాండియన్. మలయాళ హీరో కమ్ విలన్ అరుణ్ పాండియన్ కుమార్తె ఈమె. తుంబ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత మలయాళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కీర్తి. వరసగా అవకాశాలు కూడా అందుకుంటుంది. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ కావడంతో సొంత పొలంలో పనులు చేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తుంది ఈమె. 

అరుణ్ పాండియన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆయన నటించిన ప్రేమ శిఖరం లాంటి సినిమాలు తెలుగులో కూడా విజయం సాధించాయి. ఇప్పుడు ఆయన కుమార్తె కీర్తి పాండియన్ పొలం పనులు చేసుకుంటుంది. అరుణ్ పాండియన్ రైతుగా.. దర్శకుడిగా.. నటుడిగా.. రాజకీయ నాయకుడిగానూ అందరికీ సుపరిచితమే. ఇప్పుడు కూతురు కూడా నాన్న బాటలోనే నడుస్తుంది. ప్రస్తుతం ఆయనతో కలిసి మలయాళ సినిమా విలన్ తమిళ రీమేక్ లో నటిస్తుంది కీర్తి. షూటింగ్ ఆగిపోవడంతో తన పొలంలోకి వెళ్లి నాట్లు వేస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఛాలెంజులు అంటే ఇవి కదా.. ఇలాంటివి చేయండి అంటూ అంతా కీర్తిని చూపిస్తున్నారు. 

More Related Stories